అవుట్ అయిన తరువాత సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రియాక్షన్ ఏదైతే ఉందో..: ద్రవిడ్ అసహనం

Ind vs SL, 1st T20I: Dravid’s Disappointed Reaction On Suryakumar Yadav Goes Viral | Oneindia Telugu

కొలంబో: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ సారథ్యంలోని యంగ్ టీమిండియా జట్టు శ్రీలంకలో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌ను సొంతం చేసుకున్న ఈ టీమ్.. టీ20లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌ను గెలుచుకుంది. లంకేయులను 38 పరుగుల తేడాతో ఓడించింది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీ చేశాడు. అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్. శిఖర్ ధవన్ 46 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ పృథ్వీ షా మరోసారి విఫలం అయ్యాడు. ఇన్నింగ్ తొలి బంతికే అవుట్ అయ్యాడు. సున్నా పరుగులకు పెవిలియన్ చేరాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ 27, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా-10, ఇషాన్ కిషన్-14 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ చేసిన 50 పరుగులు భారత్.. తన ప్రత్యర్థికి ఓ మోస్తరు స్కోరు నిర్దేశించడానికి కారణమైంది.

సరిగ్గా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. వహిందు హసరంగ డిసిల్వా బౌలింగ్‌లో అతను అవుట్ అయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రమేష్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వహిందు హసరంగా సంధించిన ఫ్లైటెడ్ డెలివరీని భారీ షాట్ ఆడబోయాడు సూర్యకుమార్ యాదవ్. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి లాంగ్ ఆన్‌లో నేరుగా రమేష్ మెండిస్ చేతుల్లో వాలింది. తాను ఆడిన ఆ షాట్ అతనికే నచ్చలేదు. పేలవమైన షాట్ అది.

అవుట్ అయిన వెంటనే సూర్యకుమార్ యాదవ్ అసహనంగా కనిపించాడు. ఓ బూతుమాటను వినిపించాడు. కొన్ని క్షణాలపాటు క్రీజ్‌లోనే నిల్చుని పోయాడు. అక్కడి నుంచి కదల్లేదు. ఆ తరువాత అదే అసహనంతో క్రీజ్ నుంచి పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో డగౌట్‌లో కూర్చున్న కోచ్ రాహుల్ ద్రవిడ్.. కాస్త ఇరిటేట్‌గా కనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ పట్ల ద్రవిడ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కనిపించింది. అవుట్ అయిన తరువాత బూతుమాటను పలకడం, క్రీజ్‌లోనే నిల్చోవడం పట్ల రాహుల్ ద్రవిడ్ ఇరిటేట్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 26, 2021, 10:21 [IST]
Other articles published on Jul 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X