Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: ట్రోఫీలు గెల‌వ‌కుంటే.. పరుగులు, సెంచ‌రీలు చేసినా వృధాయే: రోహిత్

IND vs SCO: Rohit Sharma feels If You Dont Win Trophy, All Hundred are Nothing
T20 World Cup : IND Vs SCO, Trophy గెలవకపోతే ఎన్నిసెంచ‌రీలు చేసినా విలువివ్వరు || Oneindia Telugu

దుబాయ్: వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న క‌న్నా.. టీమ్ వ‌ర్క్ చాలా ముఖ్య‌మ‌ని టీమిండియా స్టార్ ఓపెన‌ర్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ అన్నాడు. జ‌ట్టుకు ట్రోఫీలు ద‌క్క‌కుంటే.. ఎన్ని ప‌రుగులు చేసినా, సెంచ‌రీలు కొట్టినా వృధాయే అని అభిప్రాయ‌ప‌డ్డాడు. టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో భాగంగా శుక్రవారం (నవంబర్ 5) భారత్, స్కాంట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచులో స్కాంట్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను చివరిదాకా కంగారు పెట్టింది. భారీ స్కోర్ చేసినా కివీస్ ఇన్నింగ్స్ ఆఖరి వరకు టెన్షన్ పడింది. దీంతో టీమిండియాతో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దుబాయ్ మైదానంలో ఈరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

 జ‌ట్టుకు ఏదైనా ప్ర‌యోజం ఉంటుందా అని ఆలోచిస్తా

జ‌ట్టుకు ఏదైనా ప్ర‌యోజం ఉంటుందా అని ఆలోచిస్తా

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోషల్ మీడియా హ్యాండిల్‌తో రోహిత్ శ‌ర్మ‌ మాట్లాడుతూ... '2016 నుంచి ఇప్పటివ‌ర‌కు చాలా అనుభ‌వాన్ని గ‌డించా. అప్ప‌టితో పోలిస్తే ఓ బ్యాట‌ర్‌గా చాలా ప‌రిణితి చెందా. జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన రీతిలో మ్యాచ్ ఆడాను. ఏదైనా షాట్ ఆడితే.. దాని వ‌ల్ల జ‌ట్టుకు ఏదైనా ప్ర‌యోజం ఉంటుందా అని ఆలోచించేవాడిని. ఓపెన‌ర్‌గా ఆడిన‌ప్పుడు, ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంది. దాంతో ఎక్కువ ర‌న్స్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ సెంచ‌రీలు చేసేవారిలోనూ ఎక్కువ శాతం మంది టాప్ ఆర్డ‌ర్ బ్యాటర్లు ఉంటారు' అని అన్నాడు.

ట్రోఫీ గెల‌వ‌కుంటే

ట్రోఫీ గెల‌వ‌కుంటే

'ఇటీవ‌ల కాలంలో చాలా మంది సెంచ‌రీలు చేస్తున్నారు. ఎందుకంటే ఆట‌తీరు అలా మారింది. ప్రస్తుతం ఎటువంటి జంకు లేకుండా బ్యాట‌ర్లు ఆడుతున్నారు. ఔట్ కావ‌డం గురించి ఎలాంటి డౌట్ ప‌డ‌డం లేదు. ఇది చాలా వ‌ర‌కు జ‌ట్ల‌కు క‌లిసి వస్తుంది. 2019 ప్రపంచకప్‌ వ్య‌క్తిగ‌తంగా నాకు ప్ర‌త్యేక‌మైంది. ఆ టోర్నీలో కావాల్సిన‌న్ని ర‌న్స్ చేశా.

ఆ ఆట‌తీరు నాకు సంతృప్తిని ఇచ్చింది. ఏదైనా టోర్నీలో ఆడుతున్న‌పుడు ప్ర‌తి ఒక్క‌రికీ ఓ ప్లాన్ ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వాలి. అదే నాకు వ‌ర్కౌట్ అయ్యింది. కానీ నిజం చెప్పాలంటే.. ట్రోఫీ గెల‌వ‌కుంటే, మ‌నం చేసిన ప‌రుగులు, సెంచ‌రీలు అన్నీ వృధా అయిపోతాయి' అని టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

అభిమానులపై ఫైర్

అభిమానులపై ఫైర్

ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై రోహిత్ శర్మ 47 బంతుల్లో 74 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలు బాదాడు. అఫ్గాన్ జట్టుపై మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అభిమానులపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై ఓడిన విషయాన్ని ప్రస్తావించాడు. తొలి రెండు గేమ్‌లల్లో ఓడిపోయినంత మాత్రాన భారత జట్టును బ్యాడ్‌గా చూడాల్సిన అవసరం లేదన్నాడు.

బ్యాడ్ ప్లేయర్స్, బ్యాడ్ టీమ్‌గా భావించవద్దని సూచించాడు. అన్ని ఫార్మట్లలోనూ చాలాకాలం నుంచీ నిలకడగా రాణిస్తున్నామని, సమష్టిగా సత్తా చాటుతున్నామని గుర్తు చేశాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. నిస్సందేహంగా క్వాలిటీ బౌలర్ అని రోహిత్ కితాబిచ్చాడు. ఎన్నో వికెట్లను పడగొట్టిన అనుభవం అతనికి ఉందన్నాడు. నాలుగు సంవత్సరాల తరువాత టీ20 మ్యాచ్‌ను ఆడుతూ.. వికెట్లను పడగొట్టడం అనేది అతనికి ఛాలెంజింగ్ అని, తనను తాను మరోసారి నిరూపించుకున్నాడని అన్నాడు.

Story first published: Friday, November 5, 2021, 16:54 [IST]
Other articles published on Nov 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+