Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SCO: మూడేసిన జడేజా, షమీ.. స్కాంట్లాండ్ ఆలౌట్! భారత్ ముందు స్వల్ప లక్ష్యం!!

IND vs SCO: Ravindra Jadeja, Mohammed Shami strikes Scotland all-out for 85 runs

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచులో స్కాంట్లాండ్ ఆలౌట్ అయింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా, పేసర్ మహమ్మద్ షమీలు తలో మూడు వికెట్లు పడగొట్టడంతో 17.4 ఓవర్లలో స్కాంట్లాండ్ 10 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. దాంతో టీమిండియా ముందు 86 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. స్కాంట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సే (24; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మైఖేల్ లీస్క్ (16), కాలమ్ మాక్లియోడ్ (21), మార్క్ వాట్ (14) పరుగులు చేశారు. 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ సెమీస్ చేరుకోగా.. టీమిండియాతో సహా న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయి.

భారత బౌలింగ్ దాటికి స్కాట్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ మూడో బంతిని తప్పుగా అంచనా వేసిన కైల్ కోయోట్టర్ (1) బౌల్డయ్యాడు. దాంతో 13 పరుగుల వద్ద స్కాట్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం 24 (19 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసిన మరో ఓపెనర్ జార్జ్ మున్సీ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మొహ్మద్ షమీ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్‌కు అతడు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో మాథ్యూ క్రాస్ (2), రిచీ బెరింగ్టన్ (0)లను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చి స్కాట్లాండ్‌ను భారీ దెబ్బ తీశాడు.

58 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లీస్క్ (21 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) వెనుదిరిగాడు. అనంతరం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు స్కాట్లాండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. క్రిస్ గ్రీవ్స్ (1) భారీ షాట్ ఆడబోయి హార్ధిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మొహ్మద్ షమీ 17వ ఓవర్లో విశ్వరూపమే చూపాడు. తొలి బంతికి కాలమ్‌ మెక్‌లాయిడ్‌ (16)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే సఫ్యాన్‌ షరీఫ్ (0) రనౌటయ్యాడు. మూడో బంతికి అద్భుతమైన డెలివరీతో అలస్దైర్‌ ఇవాన్స్‌ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్‌ ముగిసే సరికి 83/9తో ఉన్న స్కాట్లాండ్‌.. 18 ఓవర్లో ఆలౌట్ అయింది. అద్భుత యార్కర్‌తో మార్క్ వాట్‌ (14)ను బుమ్రా క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 85 పరుగులకు స్కాట్లాండ్‌ ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

Story first published: Friday, November 5, 2021, 21:18 [IST]
Other articles published on Nov 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+