Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SCO: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. శార్దూల్ ఔట్! మరో స్పిన్నర్‌కు అవకాశం!!

IND vs SCO Playing 11 is out: Shardul Thakur out and Varun Chakaravarthy in for India

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్, స్కాంట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టులో కోహ్లీ ఒక మార్పు చేసింది. పేస్ ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. మరోవైపు స్కాంట్లాండ్ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

టీ20 ప్రపంచకప్‌ 2021 టోర్నీలో భారత్, స్కాట్లాండ్‌లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడాయి. భారత్ ఒక మ్యాచ్ గెలిచి.. రెండు ఓడిపోయింది. 2 పాయింట్లతో గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. స్కాట్లాండ్ మొత్తం 3 మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరిధైన 6వ స్థానంలో ఉంది. భారత్, స్కాట్లాండ్‌లు టీ20 మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో భారత్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. గత మ్యాచులో స్కాంట్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను చివరిదాకా కంగారు పెట్టింది. భారీ స్కోర్ చేసినా కివీస్ ఇన్నింగ్స్ ఆఖరి వరకు టెన్షన్ పడింది. దీంతో టీమిండియాతో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, స్కాట్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడొచ్చు. ఈ మ్యాచులో టాస్ మరోసారి కీలక పాత్ర పోషించింది. మెగా టోర్నీలో విరాట్ కొహ్లీ మొదటిసారి టాస్ గెలిచాడు. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటున్నాయి. ఈరోజు కొద అదే జరిగింది. దుబాయ్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంది. ఈ పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సహకరించనుంది. మధ్య ఓవర్లలో మాత్రం స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (కీపర్), రిచీ బెరింగ్టన్, కాలమ్ మాక్లియోడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలస్డైర్ ఎవాన్స్, బ్రాడ్లీ వీల్.

Story first published: Friday, November 5, 2021, 19:28 [IST]
Other articles published on Nov 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+