
ద్రవిడ్ శతకం:
అది 2003వ సంవత్సరం. అప్పటికే రాహుల్ ద్రవిడ్ దిగ్గజ బ్యాటర్. అలాంటి రాహుల్ కౌంటీల్లో స్కాటిష్ సాల్టైర్స్ జట్టుకు ఆడాడు. 2003లో జరిగిన టోర్నమెంట్‌లో రాహుల్‌తో కుర్రాడైన స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోట్జర్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అప్పటికి కోట్జర్‌కు 19 ఏళ్లే. నార్త్‌థాంప్టన్‌తో మ్యాచ్‌లో ద్రవిడ్ శతకం (114) చేశాడు. పాపం కోట్జర్ మాత్రం తొలి బంతికే వెనుదిరిగాడు. తొలి బంతిని ఎదుర్కొన్న కోట్జర్.. పరుగు తీసేందుకు యత్నించి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ ఘటనను ఇప్పుడు మళ్లీ టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ విషయాన్ని కోట్జర్ పంచుకున్నాడు. టీమిండియాతో జరిగిన మ్యాచులో ఏడు బంతులు ఆడిన కోట్జర్.. ఒక పరుగు తీసి ఔట్ అయ్యాడు.

దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యా:
'రాహుల్ ద్రవిడ్ ఎంతో వినయవిధేయత కలిగిన వ్యక్తి. ఆటగాళ్లందరితో బాగా మాట్లాడేవాడు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ద్రవిడ్ కేవలం మూడు నెలల అగ్రిమెంట్‌ను మాత్రమే స్కాట్లాండ్ కౌంటీతో ఒప్పందం చేసుకున్నాడు. 11 మ్యాచుల్లో 60కి పైగా సగటుతో దాదాపు 600కి పైగా పరుగులు చేశాడు. అయినప్పటికీ ఆ సీజన్‌లో స్కాట్లాండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. రాహుల్, నేను రనౌట్‌లో భాగస్వాములం. అందులో ద్రవిడ్ కాకుండా నేను రనౌట్ అయ్యాను. అయితే అది మంచిదే అనుకుంటున్నా. అప్పటికే స్కాటిష్ జట్టుకు ద్రవిడ్ కీలక ఆటగాడు. మేము అనుకున్న విధంగానే బాగా ఆడాడు. జట్టుకు అవసరమైన పరుగులు సాధించాడు. నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. నో అనే పదం అటువైపు (ద్రవిడ్ నుంచి) వచ్చింది. వెనక్కి వెళ్లమని సంకేతం వచ్చింది. అయినా దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యా' అని స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోట్జర్ తెలిపాడు.

85 పరుగులకే ఆలౌట్:
టీమిండియాతో జరిగిన మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాంట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాంట్లాండ్.. భారత బౌలింగ్ దాటికి కుదేలైంది. జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ మూడో బంతికి కైల్ కోయోట్టర్ (1) బౌల్డయ్యాడు. అనంతరం (24; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మరో ఓపెనర్ జార్జ్ మున్సీ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో మాథ్యూ క్రాస్ (2), రిచీ బెరింగ్టన్ (0)లను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చి స్కాట్లాండ్‌ను భారీ దెబ్బ తీశాడు. దాంతో స్కాంట్లాండ్ 29 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక 58 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లీస్క్ (21; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) వెనుదిరిగాడు. అనంతరం అశ్విన్ దెబ్బకు స్కాట్లాండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇక షమీ 17వ ఓవర్లో విశ్వరూపమే చూపాడు. తొలి బంతికి కాలమ్ మెక్‌లాయిడ్ (16)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే సఫ్యాన్ షరీఫ్ (0) రనౌటయ్యాడు. మూడో బంతికి అద్భుతమైన డెలివరీతో అలస్దైర్ ఇవాన్స్ (0)ను పెవిలియన్ చేర్చాడు. అద్భుత యార్కర్‌తో మార్క్ వాట్ (14)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 85 పరుగులకు స్కాట్లాండ్ ఆలౌట్ అయింది.


Click it and Unblock the Notifications












