IND vs SCO: స్కాంట్లాండ్‌పై ఘన విజయం.. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసిన భారత బ్యాటర్లు!రాహుల్ రికార్డు ఫిఫ్టీ!

దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా దుబాయ్ వేదికగా స్కాంట్లాండ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. స్కాంట్లాండ్ నిర్ధేశించిన 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఈ ప్రపంచకప్‌లో రాహుల్‌దే ఫాస్టెస్ట్ హాఫ్ (18 బంతుల్లో) సెంచరీ. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీ (2), సూర్యకుమార్ యాదవ్ (6) నాటౌట్‌గా ఉన్నారు. స్కాంట్లాండ్ బౌలర్లు మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

దంచికొట్టిన రాహుల్, రోహిత్:
86 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ పూనకం వచ్చినట్టే ఆడారు. బంతి పడడమే ఆలస్యం.. బౌండరీ చేరుకోవడమే తంతుగా మారింది. మొదటి బంతి నుంచే ఇద్దరు భారీ షాట్లు ఆడారు. ముఖ్యంగా రాహుల్ శివాలెత్తాడు. బౌండరీలతో అలరించాడు. రోహిత్ కూడా రెచ్చిపోవడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే విజయానికి ఇంకో 16 పరుగులు అవసరమైన సమయంలో రోహిత్ వికెట్లు ముందు దొరికిపోయాడు. నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో రాహుల్ భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (2), సూర్యకుమార్ యాదవ్ (6) మిగిలిన పనిని పూర్తి చేసేశారు. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ (4 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ తన నెట్ రన్ రేట్‌ను (+1.619) అప్గానిస్థాన్ (+1.481) కంటే మెరుగుపరుచుకుంది.

దెబ్బ కొట్టిన జడేజా:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన స్కాంట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయ్యాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాంట్లాండ్.. భారత బౌలింగ్ దాటికి కుదేలైంది. జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ మూడో బంతికి కైల్ కోయోట్టర్ (1) బౌల్డయ్యాడు. దాంతో 13 పరుగుల వద్ద స్కాట్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం (24; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసిన మరో ఓపెనర్ జార్జ్ మున్సీ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మొహ్మద్ షమీ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్‌కు అతడు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో మాథ్యూ క్రాస్ (2), రిచీ బెరింగ్టన్ (0)లను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చి స్కాట్లాండ్‌ను భారీ దెబ్బ తీశాడు.
దాంతో స్కాంట్లాండ్ 29 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.

షమీ మాయ:
ఇక 58 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లీస్క్ (21; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్) వెనుదిరిగాడు. అనంతరం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు స్కాట్లాండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. క్రిస్ గ్రీవ్స్ (1) భారీ షాట్ ఆడబోయి హార్ధిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మొహ్మద్ షమీ 17వ ఓవర్లో విశ్వరూపమే చూపాడు. తొలి బంతికి కాలమ్ మెక్‌లాయిడ్ (16)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే సఫ్యాన్ షరీఫ్ (0) రనౌటయ్యాడు. మూడో బంతికి అద్భుతమైన డెలివరీతో అలస్దైర్ ఇవాన్స్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్ ముగిసే సరికి 83/9తో ఉన్న స్కాట్లాండ్.. 18 ఓవర్లో ఆలౌట్ అయింది. అద్భుత యార్కర్‌తో మార్క్ వాట్ (14)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 85 పరుగులకు స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications