Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah: టీ20ల్లో బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలో అగ్రస్థానం!!

IND vs SCO: Jasprit Bumrah becomes leading wicket-taker in T20Is for India.
T20 World Cup : T20ల్లో Jasprit Bumrah టాప్.. చహల్‌ ను అధిగమించి..!! || Oneindia Telugu

దుబాయ్: ​టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021​లో భాగంగా శుక్రవారం దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ జట్టుతో​ జరిగిన మ్యాచులో 2 వికెట్లు తీసిన బుమ్రా.. మొత్తంగా పొట్టి ఫార్మాట్లో 64 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా 54 టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. స్కాంట్లాండ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్కాంట్లాండ్‌ నిర్ధేశించిన 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

బుమ్రా అరుదైన రికార్డు:

బుమ్రా అరుదైన రికార్డు:

స్కాంట్లాండ్‌తో మ్యాచుకు ముందు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్‌ 49 టీ20ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. స్కాంట్లాండ్‌తో మ్యాచుకు ముందు జస్ప్రీత్‌ బుమ్రా 62 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్కాట్లాండ్‌ కెప్టెన్‌ కైల్‌ కోట్జర్ (1), లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మార్క్ వాట్ (14)ను ఔట్ చేయడం ద్వారా చహల్‌ను అధిగమించాడు బుమ్రా. ఈ జాబితాలో స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (55), పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (50), స్పిన్నర్ రవీంద్ర జడేజా (43), ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా (42)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అగ్రస్థానంలో షకీబ్‌:

అగ్రస్థానంలో షకీబ్‌:

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. షకీబ్‌ 94 మ్యాచ్‌ల్లో 117 వికెట్లు పడగొట్టాడు. షకీబ్‌ తర్వాత శ్రీలంక మాజీ పేసర్ లసిత్‌ మలింగ (84 మ్యాచ్‌ల్లో 107), ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ (54 మ్యాచ్‌ల్లో 102), న్యూజీలాండ్ సీనియర్ పేసర్ టిమ్‌ సౌథీ (85 మ్యాచ్‌ల్లో 101) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 21వ స్థానంలో ఉన్నాడు. టాప్-10లో ఒక్క భారత బౌలర్ లేకపోవడం గమనార్హం.

రెండో బ్యాటర్‌గా రాహుల్:

రెండో బ్యాటర్‌గా రాహుల్:

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ ఓ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. రాహుల్ 18 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. దాంతో టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. యువీ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ 2009లో శ్రీలంకపై 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 2007లో ఆస్ట్రేలియాపై, 2009లో శ్రీలంకపై యువరాజ్ 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు.

యువీ1:

యువీ1:

టీ20 ప్రపంచకప్‌లలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. యువీ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది ఈ అరుదైన ఫీట్ తన పేరుపై రాసుకున్నాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా యువీ దరిదాపుల్లోకి రాలేదు. 2014లో స్టీఫెన్ మేబెర్గ్ 17 బంతుల్లో ఫిఫ్టీ బాది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2014లో గ్లెన్ మాక్స్‌వెల్, 2021లో కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాది సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

Story first published: Saturday, November 6, 2021, 8:37 [IST]
Other articles published on Nov 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+