Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చహల్‌కు రితిక షాకింగ్ రిప్లై.. అందుకే నిన్ను కట్‌ చేశా!!

Chahal's Funny Conversation With Rohit's Wife Ritika || Oneindia Telugu
IND vs SA: Yuzvendra Chahals light fun banter with Rohit Sharmas wife Ritika Sajdeh

బెంగళూరు: భారత స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ సతీమణి రితికా స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. చహల్‌ జట్టులోని అందరితో సరదాగా ఉంటాడు. మ్యాచ్ అనంతరం తన 'చహల్‌ టీవీ' ద్వారా టీమిండియా జట్టులోని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఆటగాళ్లు కూడా చహల్‌తో తన అనుభవాలు పంచుకుంటుంటారు. దీంతో చహల్‌తో జట్టు సభ్యులు సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ-యజ్వేంద్ర చహల్‌ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

రోహిత్‌ కుటుంబంతో కూడా చహల్‌ బాగా చనువుగా ఉంటాడు. ఆదివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడో టీ20 కోసం బెంగళూరులో ఉన్న రోహిత్‌ శర్మను రితిక కలిశారు. ఈ సందర్భంగా తాను, రోహిత్‌, కుమార్తె సమైరాతో దిగిన ఒక సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి 'రీయునైటెడ్‌' అనే క్యాప్షన్‌ ఇచ్చారు రితిక. ఆ ఫొటోపై చాహల్‌ స్పందిస్తూ.. 'ఫొటోలో నన్ను ఎందుకు కట్‌ చేశారు' అని సరదాగా ప్రశ్నించారు.

రితికా చాహల్‌కు సమాధానమిస్తూ.. 'నీ ముఖంలోని ప్రశాంతత ఫొటోలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం భారత్‌ జట్టులో లేవు కదా. అందుకే నిన్ను కట్‌ చేశా' అంటూ రితిక సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. పలువురు అభిమానులు కూడా చాహల్‌పై హాస్యాస్పదంగా కామెంట్లు చేశారు.

గతంలో కూడా వీరి మధ్య ఇటువంటి కామెంట్ల చమత్కరింపే నడిచింది. రోహిత్‌ శర్మ ఒక ఫొటో షేర్‌ చేయగా.. దానికి చాహల్‌ 'మిస్‌ యూ రోహిత్‌' అని స్పందించాడు. దీంతో రితికా స్పందిస్తూ.. 'ఇప్పుడు రోహిత్‌ నా మనిషి' అంటూ ప్రతిస్పందించి అభిమానులను ఆకట్టుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో చహల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.

Story first published: Sunday, September 22, 2019, 17:38 [IST]
Other articles published on Sep 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+