Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ భయాల మధ్య థర్డ్ వార్ - దక్షిణాఫ్రికాతో భారత్ బిగ్ ఫైట్

IND vs SA, Weather and pitch report: The chances of rain are very low in Perth

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ కీలక మ్యాచ్ ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లలో ఘన విజయాల తరువాత మూడో యుద్ధానికి సమాయాత్తమౌతోంది. ఇందులో కూడా నెగ్గి- తన మేజిక్‌ను రిపీట్ చేస్తుందా?, దూకుడును కొనసాగిస్తుందా? లేదా అనేది అభిమానులను ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్‌ను కూడా గెలవగలిగితే- సెమీ ఫైనల్స్ దాదాపుగా ఖాయమైనట్టే.

 దిగ్గజాల పోరు..

దిగ్గజాల పోరు..

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ టోర్నమెంట్‌లో తొలుత పాకిస్తాన్‌, అనంతరం నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. తన తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లు గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక.

మరో రెండు..

మరో రెండు..

ఇదొక్కటే కాకుండా మరో రెండు మ్యాచ్‌లు కూడా ఇవ్వాళే షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్ ఈ ఉదయం 8:30 గంటలకు మొదలవుతుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జింబాబ్వే - ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు ఉంటుంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన పాకిస్తాన్‌ను ఓడించిన ఊపు మీద ఉంది జింబాబ్వే. రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్.. నెదర్లాండ్స్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. పెర్త్‌ దీనికి వేదిక. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

వరుణుడి స్కెచ్ వేరు..

వరుణుడి స్కెచ్ వేరు..

ఎవరి వ్యూహాలు వారికి ఉన్నా.. వరుణుడి స్కెచ్ మరోలా ఉంటోంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వాష్డ్ అవుట్ అయ్యాయి. పలు మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. మరి కొన్నింటి ఓవర్లను కుదించాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా- జింబాబ్వే మ్యాచ్ కూడా ఇందులో ఒకటి. శుక్రవారం మొత్తంగా రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ కాగా.. అవి పూర్తిగా రద్దయ్యాయి.

మధ్యాహ్నం వర్షం పడే ఛాన్స్..

మధ్యాహ్నం వర్షం పడే ఛాన్స్..

వర్షం బెడద ఇవ్వాళ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. మధ్యాహ్నం పెర్త్‌లో వర్షం పడొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అదే జరిగితే పాకిస్తాన్-నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ఆటంకం కలిగొచ్చు. ఇదే పెర్త్‌లో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. సాయంత్రానికి వర్షం తగ్గొచ్చంటూ బ్యూరో ఆఫ్ మెటెరాలజీ అంచనా వేసింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డం పడే ఛాన్సులు చాలా తక్కువగానే ఉన్నాయి. రాత్రివేళ చినుకులు పడటానికి ఉన్న ఛాన్స్- ఎనిమిది శాతం మాత్రమే.

బ్యాటింగ్ ఫ్రెండ్లీ..

బ్యాటింగ్ ఫ్రెండ్లీ..

ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న పెర్త్‌ది ఫ్లాట్ పిచ్. బ్యాటర్లకు అనుకూలించే పిచ్ అయినప్పటికీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ బౌలర్లకు సహకరిస్తుంది. తొలి ఇన్నింగ్ యావరేజ్ 143 పరుగులు. రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే ఈ పిచ్‌పై విజయావకాశాలు అధికం. మొత్తంగా 60 సార్లు ఛేజింగ్ జట్టు ఇక్కడ విజయాన్ని అందుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

టీమిండియా తుదిజట్టులో- కేఎల్ రాహుల్ / రిషభ్ పంత్, రోహిత్ శర్మ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో టెంబా బావుమా (కేప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రొస్సొ, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఎన్రిచ్ నోర్ట్జే, తబ్రేజ్ షామ్సీ ఆడొచ్చు.

Story first published: Sunday, October 30, 2022, 7:13 [IST]
Other articles published on Oct 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+