
లడ్డూ లాంటి క్యాచ్..
లెఫ్టార్మ్ స్పిన్‌లో తడబడే కోహ్లీ బలహీనతను టార్గెట్ చేస్తూ సౌతాఫ్రికా ఫలితం రాబట్టింది. షంసీ వేసిన 29వ ఓవర్లో ప్రణాళిక తగ్గట్లు ఫీల్డ్ సెటప్ చేసి.. కోహ్లీ కోసం ఉచ్చును బిగించింది. బ్యాక్వర్డ్ స్లిప్ పెట్టి ఊరించే బంతితో స్వీప్ షాట్ ఆడేలా టెంప్ట్ చేసిన సౌతాఫ్రికా.. ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. ఇక బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ.. అడ్వాన్స్‌గా స్వీప్ షాట్ ఆడటంతో బాటమ్ ఆఫ్‌ది బ్యాట్ తగిలి గాల్లోకి లేచింది. ఫార్వార్డ్ ఫీల్డర్‌గా ఉన్న బవుమా చేతిలో క్యాచ్‌లో లడ్డూలా వెళ్లింది. దాంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది.

సచిన్ రికార్డు బ్రేక్..
ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 5065 పరుగులు చేయగా.. కోహ్లీ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం విరాట్ 5108 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.
|
92 పరుగుల భాగస్వామ్యం..
297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మార్కరమ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీతో శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడాడు. ధాటిగా ఆడుతూ ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కోహ్లీ తనదైన శైలిలో క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో అతనికి సహకరించాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకోగా.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ధావన్‌ను మహరాజ్ సూపర్ బాల్‌తో బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ ఔటయ్యాడు.

బవుమా, డస్సెన్ శతకాలు..
కెప్టెన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రాసీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. బవుమా, డస్సెన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు. మిగత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ 72 పరుగులు సమర్పించుకొని కెరీర్లోనే అత్యంత చెత్త ప్రదర్శనను మూటగట్టుకున్నాడు.