Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కోహ్లీ ప్రశంసలు: రోహిత్ ఔట్‌స్టాండింగ్.. మయాంక్ బ్రిలియంట్!!

IND vs SA 2019,1st Test : Virat Kohli Praises Rohit Sharma After Vizag Test Win || Oneindia Telugu
IND vs SA: Virat Kohli Praises Outstanding Rohit Sharma After Vizag Test Win

వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

 పరుగులేవీ సులువుగా రాలేదు

పరుగులేవీ సులువుగా రాలేదు

మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్.. బౌలర్లు మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలను ఆకాశానికెత్తేశాడు. 'మొదటి మూడు రోజులు వికెట్ చాలా బాగుంది. వర్షంతో ఒక సెషన్‌ కోల్పోయాం. అయితే 500కు పైగా పరుగులు చేసిన తర్వాత ప్రత్యర్థి జట్టుకి కష్టంగా మారిపోతుంది. మయాంక్, రోహిత్‌ చాలా బాగా ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాతావరణం, పిచ్‌ కారణంగా పరుగులేవీ సులువుగా రాలేదు' అని రోహిత్ తెలిపాడు.

రోహిత్ ఔట్‌స్టాండింగ్

రోహిత్ ఔట్‌స్టాండింగ్

'రోహిత్ ఔట్‌స్టాండింగ్. మయాంక్ బ్రిలియంట్. ఇద్దరు మంచి భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను శాసించారు. పిచ్, వాతావరణ పరిస్థితులను సరిగ్గా అంచనా వేశారు. స్పిన్నర్లే పని పూర్తి చేస్తారని ఫాస్ట్‌ బౌలర్లు గనక భావిస్తే అది తప్పు. కానీ మన ఫాస్ట్‌ బౌలర్లు స్వదేశంలో కూడా బాగా రాణిస్తున్నారు. వారు చిన్న స్పెల్‌లే వేసినా అవి జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. షమీ, ఇషాంత్, జస్‌ప్రీత్, ఉమేష్ బాగా రాణిస్తున్నారు. మన పేస్ దుర్బేధ్యంగా ఉంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

షమీ మళ్లీ నిరూపించాడు

షమీ మళ్లీ నిరూపించాడు

'కష్టతరమైన పరిస్థితులలో కూడా జట్టు కోసం జడేజా, అశ్విన్‌ పోరాడారు. ఇద్దరూ చెరో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చాలా రోజులుగా రెండో ఇన్నింగ్స్‌లో షమీ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే చేసి చూపించాడు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య గురువారం పుణె వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

Story first published: Monday, October 7, 2019, 9:49 [IST]
Other articles published on Oct 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+