
ఆ రెండు సిక్సర్లు..
పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో హ్యారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతులను కోహ్లీ సిక్సులు మలిచిన విధానం ఇప్పుడిప్పుడే అభిమానుల స్మృతిపథం నుంచి చెరిగిపోయేలా కనిపించట్లేదు. పలువురు క్రికెటర్లు, లెజెండరీ ప్లేయర్లు, మాజీలు, కామెంటర్లు- ఈ సిక్సర్ల గురించి ప్రతీసారీ ప్రస్తావిస్తూనే వస్తోన్నారు. విరాట్ కోహ్లీ గొప్పదనాన్ని వివరిస్తోన్నారు. సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, బ్రెట్ లీ.. ఇలా చాలామంది కోహ్లీని ఆకాశానికెత్తేశారు.

రోజర్ బిన్నీ రిమార్క్స్ ఇవీ..
ఇప్పుడు తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. అతణ్ని ఓ క్లాసిక్ ప్లేయర్‌గా అభివర్ణించాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రత్యర్థిపై ఎలా విరుచుకుపడాలో.. తీవ్ర ఒత్తిళ్లను ఎలా జయించాలో పాకిస్తాన్‌పై గేమ్‌లో కోహ్లీ చూపించాడని కితాబిచ్చారు. ఈ ఇన్నింగ్‌ను చూసి, ఒత్తిళ్ల మధ్య ప్రతి ఒక్క ప్లేయర్ కూడా కోహ్లీలాగే రాణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

బిన్నీ సన్మాన కార్యక్రమంలో..
బీసీసీఐ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన రోజర్ బిన్నీని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రోజర్ బిన్నీ మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఇన్నింగ్ ఓ కలలాంటిదని, దానికి అతను వాస్తవ రూపాన్ని ఇచ్చాడని రోజర్ బిన్నీ పేర్కొన్నారు. బంతిని ఎన్ని రకాలుగా హిట్ చేయాలో.. అన్నీ చేసి చూపించాడని రోజర్ బిన్నీ వ్యాఖ్యానించారు.

తానను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..
భారత్‌కకు ఎన్నో మ్యాచ్‌లల్లో విజయాను అందించిన ఘనత కోహ్లీకి ఉందని, కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. భారత్- పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్‌లు జరిగాయని, పూర్తిగా పాక్ చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్‌ను భారత్ లాగేసుకున్న సందర్భాలు లేవని అన్నారు. ఇప్పట్లో క్రికెట్ ప్రేమికులెవరూ గానీ పాకిస్తాన్‌పై కోహ్లీ ఆడిన విధానాన్ని, అతను కొట్టిన రెండు సిక్సర్లనూ విస్మరించలేరని రోజర్ బిన్నీ చెప్పారు.


Click it and Unblock the Notifications












