For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: అతని వల్లే ఈ వికెట్ల వేట మొదలైంది: వరుణ్ చక్రవర్తి

దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలో తిరిగి చోటు సంపాదించాడు వరుణ్ చక్రవర్తి. ఐపీఎల్-2024లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించడం, కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు ఇవ్వడంతో భారత జట్టులోకి వచ్చేశాడు. పునరాగమనం అనంతరం వికెట్ల వేట మొదలుపెట్టాడు. తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తాచాటిన వరుణ్ ఆదివారం జరిగిన సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో ఏకంగా అయిదు వికెట్లు పడగొట్టాడు.

2021 వరకు భారత్ తరఫున ఆరు టీ20లు ఆడిన వరుణ్ చక్రవర్తి కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రీఎంట్రీ అనంతరం అయిదు మ్యాచ్‌లు ఆడిన అతను ఏకంగా 13 వికెట్లు సాధించాడు. వికెట్ల వేటతో పాటు పొదుపుగానూ బౌలింగ్ చేస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శనకు కారణం కోచ్ గౌతమ్ గంభీర్ అని ఈ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ అంటున్నాడు.

IND vs SA Varun Chakaravarthy Praises Gautam Gambhir s Guidance for Providing Role Clarity

భారత జట్టులో తన పాత్రపై గంభీర్ స్పష్టత ఇవ్వడంతోనే నిలకడగా వికెట్లు సాధిస్తున్నాని వరుణ్ తెలిపాడు. ''బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ సమయంలో కోచ్ గంభీర్‌తో మాట్లాడాను. అతను జట్టులో నా పాత్రపై స్పష్టత ఇచ్చాడు. 'నువ్వు 30 లేదా 40 పరుగులైనా ఇవ్వు. అయినా ఫర్వాలేదు. ప్రత్యర్థి వికెట్ల మీదనే దృష్టిసారించు. వికెట్లు తీయడమే నీ పాత్ర' అని గంభీర్ చెప్పాడు. ఆ క్లారిటీ నా ప్రదర్శనకు మరింత సాయంగా మారింది''

''గత మూడేళ్లు కష్టంగా సాగాయి. అయితే నేను ఎంతో క్రికెట్ ఆడాను. తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడాను. నా ఆటను మరింత అర్థం చేసుకోవడానికి ఈ దేశవాళీ లీగ్ ఉపయోగపడింది. ఇది నాకెంతో సాయపడింది. ఇక రెండో టీ20 గురించి చెప్పాలంటే.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో సూర్య నాతో వచ్చి.. మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించ వద్దని, దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేయమని చెప్పాడు. దాని కోసం మేం అత్యుత్తమంగా ప్రయత్నించాం. కానీ అంతిమంగా అందుకోలేకపోయాం'' అని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు.

గెబేహా వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 45 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) చెమటోడ్చాడు. సఫారీ బౌలర్లలో మార్కో జేన్సన్, కొయెట్జీ, సిమలెనే, మార్క్‌రమ్, పీటర్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓ దశలో దక్షిణాఫ్రికా 16 ఓవర్లకు 88/7తో ఓటమి అంచుల్లో నిలిచింది. కానీ ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో, 7 ఫోర్లు), గెరాల్డ్ కొయెట్జీ (19 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పారు.

Story first published: Monday, November 11, 2024, 14:33 [IST]
Other articles published on Nov 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+