|
సునాయస విజయం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 48.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 288 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే సునాయ విజయాన్నందుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్(66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78), జెన్నెమన్ మలాన్(108 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 91) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరగనుంది.
|
డికాక్, మలాన్ సూపరో సూపర్..
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు జెన్నమన్ మలాన్, క్వింటన్ డికాక్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. దాంతో పవర్ ప్లేలోనే సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. అనంతరం మరింతగా ధాటిగా ఈ జోడీ.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. క్వింటన్ డికాక్‌ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని రిషభ్ పంత్ చేజార్చాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అనంతరం జెన్నెమన్ మలాన్ కూడా అర్థ శతకం సాధించాడు.
|
ఆడుతూ పాడుతూ..
క్రీజులో పాతుకు పోయిన ఈ జోడీని లార్డ్ శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. క్వింటన్ డికాక్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అంపైర్ ఔటవ్వికపోవడంతో రివ్యూ ద్వారా భారత్ ఫలితం సాధించింది. దాంతో 132 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి కెప్టెన్ టెంబా బవుమా(35)తో జెన్నెమన్ మలాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇక సెంచరీకి చేరువైన మలన్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే టెంబా బవుమాను చాహల్ సూపర్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్(35 నాటౌట్), రాసీ వన్ డెర్ డస్సెన్(34 నాటౌట్) ఎలాంటి తప్పిదం చేయకుండా మ్యాచ్‌ను ముగించారు.