For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైజాగ్ టెస్ట్‌: ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌

IND vs SA: Rohit Sharma Scores century In Opening Debut In Test

విశాఖ: విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ (100; 154 బంతుల్లో, 10x4, 4x6) సెంచరీ చేసాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 154 బంతులు ఎదుర్కొన్న 100 పరుగులు చేసాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే రోహిత్ సెంచరీ చేయడం విశేషం.

భారత్‌కు శుభారంభం:

భారత్‌కు శుభారంభం:

మయాంక్‌ అగర్వాల్‌ (84; 183 బంతుల్లో, 11x4, 2x6)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్ భారత్‌కు మంచి శుభారంభం అందించాడు. పర్యాటక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న ఓపెనర్లు వికెట్ల నడుమ చక్కటి సమన్వయంతో పరుగులు తీస్తున్నారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడుపుతున్నారు. సన్నాహక మ్యాచ్‌లో పరుగులేమీ సాధించకుండా ఔటైన రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతాడోనని అంతా ఆందోళన చెందారు. కానీ ఆరంభంలో ఆచితూచి ఆడిన రోహిత్‌.. అనంతరం తనదైన శైలిలో రెచ్చిపోయాడు.

అష్ట కష్టాలు పడుతున్న బౌలర్లు:

అష్ట కష్టాలు పడుతున్న బౌలర్లు:

రోహిత్ కుదురుకున్నాడంటే అతని ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. రోహిత్‌, అగర్వాల్‌ మొదటి వికెట్‌కు ఇప్పటికే 202 పరుగుల భాగస్వామ్యం అందించారు. అగర్వాల్‌ కూడా సెంచరీకి దగ్గరగా వచేసాడు. తనదైన షాట్లతో అలరిస్తూ.. రోహిత్‌కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడీని విడదీయడానికి ప్రొటీస్ బౌలర్లు అష్ట కష్టాలు పడుతున్నారు. స్టార్ పేసర్ రబాడా కూడా చేతులెత్తేశాడు. మరోవైపు స్పిన్నర్లు కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. ఓపెనర్లు ఇలాగే చెలరేగితే టీమిండియా భారీ స్కోర్‌ సాధించడం ఖాయం.

వికెట్‌ నష్టపోకుండా 202 పరుగులు:

వికెట్‌ నష్టపోకుండా 202 పరుగులు:

టీ విరామం సమయానికి భారత్ 59 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ (115), మయాంక్‌ అగర్వాల్‌ (4) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ల ఆటతో విశాఖ స్టేడియం హోరెత్తుతోంది. అభిమానులు కేరింతలతో స్టేడియం మొత్తం సందడిగా మారింది. రోహిత్ ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు.

 ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు:

ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు:

# శిఖర్ ధావన్ (187) vs ఆస్ట్రేలియా, మొహాలీ, 2013-14

# కేఎల్ రాహుల్ (110) vs ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్, 2014-15

# పృథ్వీ షా (134) vs వెస్టిండీస్, రాజ్‌కోట్, 2018-19

# రోహిత్ శర్మ (115 నాటౌట్) vs సౌతాఫ్రికా, వైజాగ్, 2019-20

Story first published: Wednesday, October 2, 2019, 14:49 [IST]
Other articles published on Oct 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+