Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: ఓపెనింగే నాకు సరిపోతుంది.. ప్యాడ్లు కట్టుకొని నేరుగా వెళ్లి ఆడొచ్చు: రోహిత్

IND vs SA 2019, 1st Test Day 1 : Rohit Bradman Sharma Says I am An Opener Not For 5,6 Positions
IND vs SA: Rohit Sharma said Opening batting suits me, Wearing the pads and straightaway walking in to bat

వైజాగ్: ఓపెనింగే నాకు సరిగ్గా సరిపోతుంది. ప్యాడ్లు కట్టుకొని మైదానంలోకి నేరుగా వెళ్లి ఆడొచ్చు అని టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ (100; 154 బంతుల్లో, 10x4, 4x6) సెంచరీ చేసాడు. రోహిత్ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ 154 బంతుల్లో 100 పరుగులు చేసాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే రోహిత్ సెంచరీ చేసాడు.

ఓపెనింగే నాకు సరిపోతుంది

ఓపెనింగే నాకు సరిపోతుంది

తొలిరోజు ఆట అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ఓపెనింగే నా ఆటకు సరిపోతుందని నేను అనుకుంటున్నా. ప్యాడ్లు కట్టుకొని నేరుగా మైదానంలోకి వెళ్లి ఆడొచ్చు. అదే 5, 6 స్థానాల్లోనైతే ఆటకోసం ఎదురుచూడాలి. అయితే మిడిలార్డర్‌ నాకు సరిపోదని చెప్పను. కానీ 5, 6 స్థానాల్లో ఆడితే ఆలోచనా ధోరణి భిన్నంగా ఉండాలి. బాల్‌ రివర్స్‌ స్వింగ్‌ అవుతుంది. ఫీల్డింగ్‌ పొజిషన్లు వేర్వేరుగా ఉంటాయి. అవన్నీ గమనించాలి. అవన్ని పక్కనబెడితే.. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడక తప్పదు. ఇది నాకో గొప్ప అవకాశం' అని అన్నాడు.

ఓపెనింగ్‌ భిన్నంగా ఉంటుంది

ఓపెనింగ్‌ భిన్నంగా ఉంటుంది

'టెస్టులో ఓపెనింగ్‌ స్థానం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వెస్టిండీస్‌ పర్యటనలో దీనిపై జట్టు మేనేజ్మెంట్ నాకు స్పష్టంగా చెప్పారు. రెండేళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. నేను ఓపెనింగ్‌ చేయాల్సి వస్తుందని ఇదివరకే ఊహించాను. అందుకు తగినట్టుగా సిద్ధమయ్యా. టెస్ట్ క్రికెట్లో ఓపెనింగ్‌ భిన్నంగా ఉంటుంది. మానసికంగా మెదడుకు శిక్షణనివ్వాలి. టెక్నిక్‌ పరంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త బంతిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి' అని రోహిత్‌ తెలిపాడు.

క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తా

క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తా

'ఏరుపు బంతి ఎక్కువ సేపు స్వింగ్‌ అవుతుంది. ఏ పరిస్థితుల్లోనైనా తొలుత బంతి స్వింగ్‌ అవుతుంది. ఇన్నింగ్స్ ఆరంభం అంత ఈజీ ఏం కాదు. శరీరానికి దగ్గరగా వచ్చే బంతుల్ని వదిలేయడం మంచింది. విశాఖ పిచ్‌ మందకొడిగా ఉంది. ఫీల్డర్లు వలయం లోపల ఉండడంతో పరుగులు చేయడం కష్టమని తెలుసు. అందుకే తొలుత క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తా. అనంతరం పరుగులు చెయ్యడానికి సిద్దమవుతా' అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 3, 2019, 10:18 [IST]
Other articles published on Oct 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+