IND vs SA: వైజాగ్ టెస్టులో సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన రోహిత్!!

వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీ చేసాడు. రెండో రోజు మహారాజ్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన రోహిత్‌ను వికెట్ కీపర్ డికాక్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగుల భాగస్వామ్యంకు తెరపడింది.

బ్రాడ్‌మన్ సరసన రోహిత్:
టెస్టుల్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ విమర్శకులకు చెక్ పెడుతూ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టెస్టుల్లో ఇది రోహిత్‌కు నాలుగో సెంచరీ. అంతకుముందు మిగతా మూడు సెంచరీలు మిడిల్ ఆర్డర్‌లో వచ్చి చేసాడు. అయితే సొంత గడ్డపై అత్యధిక టెస్టు యావరేజ్ నమోదు చేసిన ఆటగాళ్లలో డాన్ బ్రాడ్‌మన్ సరసన రోహిత్ చేరాడు. టెస్టుల్లో 80 ఇన్నింగ్స్‌లు ఆడిన బ్రాడ్‌మన్ 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో 99.94 సగటు కలిగి ఉన్నాడు. ఇక్క బ్రాడ్‌మన్ తన సొంతగడ్డ ఆస్ట్రేలియాలో 50 ఇన్నింగ్స్‌ల్లో 98.22 సగటు సాధించాడు.

సొంత గడ్డపై అత్యధిక యావరేజ్:
భారత గడ్డపై కూడా రోహిత్ ఇదే సగటును నమోదు చేసాడు. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి సొంత గడ్డపై అత్యధిక యావరేజ్ నమోదు చేసిన ఆటగాళ్లలో బ్రాడ్‌మన్ సరసన రోహిత్ చేరాడు. సొంత గడ్డపై ఇప్పటివరకూ 15 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. 98.22 టెస్టు సగటుతో 884 పరుగులు చేసాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మూడు ఫార్మాట్‌లలో సెంచరీ:
వైజాగ్ టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ సెంచరీ చేసాడు. ఫలితంగా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగి.. తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. అంతేకాదు ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్‌లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్‌గా కూడా రోహిత్ రికార్డులోకి ఎక్కాడు. రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (138), చటేశ్వర్ పుజారా (6) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications