For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: అశ్విన్ 350 వికెట్‌లు.. 'స్పెషల్ వికెట్‌' ఎదో తెలుసా?!!

IND vs SA 2019,1st Test : Ravichandran Ashwin Reveals His 'Special Wicket' After Vizag Test Win
IND vs SA: Ravichandran Ashwin Reveals His Special Wicket in Test Career

వైజాగ్: విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పేసర్ మొహమ్మద్ షమీ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. మరోవైపు ఈ టెస్టులో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 7 వికెట్లు తీసాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసి.. టెస్టు ఫార్మాట్‌లో వేగవంతంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో డిబ్రుయిన్‌ను ఔట్‌ చేసిన తర్వాత అశ్విన్‌ ఈ ఘనత అందుకున్నాడు.

మురళీధరన్‌ 66వ టెస్టులో 350 వికెట్లు తీయగా.. అశ్విన్‌ సైతం అన్నే టెస్టుల్లో 350 వికెట్లు సాధించాడు. దీంతో తక్కువ టెస్టుల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన రికార్డును అశ్విన్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు వేగవంతంగా 350 వికెట్లట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా కూడా అశ్విన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే 77వ టెస్టులో ఈ ఫిట్ చేరుకోగా.. వెటరన్ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ 83వ టెస్టులో 350 వికెట్లు సాధించాడు.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత ఫీల్డించ్‌ కోచ్ శ్రీధర్‌ చేసిన ఇంటర్వ్యూలో అశ్విన్‌ మాట్లాడాడు. 'క్రికెట్‌ కెరీర్‌లో రికార్డులు సహజం. ఆటలో భాగంగా రికార్డులు అవే వస్తుంటాయి. అంతేగాని రికార్డుల కోసం ఎవరూ ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకోరు. 350 వికెట్లు తీయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడూ కూడా మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. మ్యాచ్‌కు ముందు శారీరకంగా, మానసికంగా సన్నద్ధమైన తర్వాత బరిలోకి దిగుతా' అని తెలిపాడు.

'నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన వికెట్లు ఉన్నాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డారెన్ బ్రావో నా మొదటి టెస్ట్ వికెట్. అది ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. డేవిడ్ వార్నర్‌ను చాలా సార్లు ఔట్ చేసాను. కానీ.. రెండో రోజు ఉదయం బెంగళూరులో వార్నర్ వికెట్ ప్రత్యేకమైనది. 2015లో నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో డివిలియర్స్ వికెట్‌ను కూడా మరిచిపోలేను. డారెన్ బ్రావో వికెట్ మాత్రం నాకు చాలా ప్రత్యేకం' అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Story first published: Monday, October 7, 2019, 11:21 [IST]
Other articles published on Oct 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+