Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: టెస్టుల్లో 350 వికెట్లు.. తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు!!

IND vs SA: R Aswhin equals Muttiah Muralitharan record for fastest to 350 Test wickets

విశాఖ: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకువెళుతోంది. చివరి రోజు భారత బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా 70 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. ఆదివారం పేసర్ మహ్మాద్ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి తలో మూడు వికెట్లు తీశారు. ఇక స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ రోజు వికెట్ల వేటను ఆరంభించాడు.

మురళీధరన్‌ రికార్డు సమం

మురళీధరన్‌ రికార్డు సమం

మ్యాచ్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే డిబ్రుయిన్‌ (10)ను అశ్విన్‌ బౌల్డ్‌ చేసాడు. ఈ వికెట్ తీయడంతో అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో వేగవంతంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు. మురళీధరన్‌ 66వ టెస్టులో 350 వికెట్లు తీయగా.. అశ్విన్‌ సైతం అన్నే టెస్టుల్లో 350 వికెట్లు సాధించాడు. దీంతో తక్కువ టెస్టుల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన రికార్డును అశ్విన్ సొంతం చేసుకున్నాడు.

తొలి భారత బౌలర్‌గా

తొలి భారత బౌలర్‌గా

వేగవంతంగా 350 వికెట్లట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా కూడా అశ్విన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే 77వ టెస్టులో ఈ ఫిట్ చేరుకోగా.. వెటరన్ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ 83వ టెస్టులో 350 వికెట్లు సాధించాడు. ఈ టెస్టుకు ముందు 350 వికెట్లు సాధించడానికి అశ్విన్‌ ఎనిమిది వికెట్ల దూరంలో ఉండగా.. త్వరగానే ఆ మైలురాయిని అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన స్పిన్‌ మ్యాజిక్‌ను చూపించి 7 వికెట్లు తీసాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసి ఈ అరుదైన ఘనతను తన పేరుపై లికించుకున్నాడు.

భారత్‌ విజయం లాంఛనమే

భారత్‌ విజయం లాంఛనమే

ఐదో రోజు లంచ్ విరామానికి దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో టెయిలెండర్లు ముత్తుసామి, డేన్‌పీట్‌ అద్భుత పోరాటం చేశారు. వీరిద్దరు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ప్రొటీస్ స్కోర్ బోర్డు ముందుకు సాగింది. అయితే లంచ్ అనంతరం అర్ధ సెంచరీ చేసిన డేన్‌పీట్‌ను షమీ బోల్డ్ చేసాడు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 61 ఓవర్లకు 174 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సేనురాన్ ముత్తుసామి (19), కాగిసో రబాడ (32) బ్యాటింగ్‌ చేస్తున్నారు. టీమిండియా విజయానికి ఇక ఒక వికెట్ కావాలి. ఇంకా దక్షిణాఫ్రికా 215 పరుగుల వెనుకబడి ఉండటంతో భారత్‌ విజయం లాంఛనమే.

Story first published: Sunday, October 6, 2019, 13:56 [IST]
Other articles published on Oct 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+