For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: టీ బ్రేక్: డికాక్‌ హాఫ్ సెంచరీ.. దక్షిణాఫ్రికా 292/5

IND vs SA: Quinton DeKock hits Half Century, South Africa Reach 292/5 At Tea break

విశాఖ: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో జ‌ర‌గుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్‌ డికాక్‌ (50;79 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీ నమోదు చేసాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (55) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన డికాక్‌ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బౌండరీలతో చెలరేగుతున్నాడు. మరోవైపు సెంచరీ హీరో డీన్‌ ఎల్గర్‌ (133; 250 14x4, 4x6) కూడా నిలకడగా ఆడుతున్నాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు 180 బంతుల్లో 114 పరుగులు జోడించారు. కీలక సమయంలో ఎల్గ‌ర్ సెంచ‌రీ, డికాక్‌ హాఫ్ సెంచరీ చెలరేగడంతో టీమిండియాకు ద‌క్షిణాఫ్రికా ధీటుగా బదులిస్తోంది.

1
46113

దక్షిణాఫ్రికా 39/3తో మూడో రోజు ఆటను ప్రారంబించింది. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఎల్గర్‌, బవుమా నిలకడగా ఆడారు. అయితే 27వ ఓవర్‌ వేసిన ఇషాంత్‌ తొలి బంతికే బవుమాను పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 40వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఎల్గర్‌.. బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అర్ధ సెంచరీ అనంతరం డుప్లెసిస్‌ ఔట్‌ అయ్యాడు. అనంతరం డికాక్ సహాయంతో ఎల్గర్‌ సెంచరీ సాధించాడు. ఇది ఎల్గర్‌కు 12వ టెస్టు సెంచరీ. ఆసియా ఖండంలో రెండో సెంచరీ కాగా.. భారత్‌లో తొలి సెంచరీ. ఇక 2010 త‌ర్వాత ఇండియా పిచ్‌ల‌పై ఓ ద‌క్షిణాఫ్రికా ఆటగాడు టెస్టుల్లో సెంచ‌రీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. అయితే సెంచరీ అనంతరం ఎల్గర్‌ నెమ్మదించగా.. డికాక్ బ్యాట్ జులిపించాడు. 69 పరుగులలో 11 బౌండరీలు, ఓ సిక్స్ ఉందంటే.. ఎంత ధాటిగా ఆడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రంమలోనే డికాక్ హాఫ్ సెంచరీ చేసాడు.

ఫాలోఆన్ నుంచి త‌మ జ‌ట్టును ర‌క్షించేందుకు ఇద్దరు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. టీ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 87 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. క్రీజులో డికాక్ (69), ఎల్గర్‌ (133) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు 210 పరుగులు వెనకబడి ఉంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు వికెట్లు తీసాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 136 ఓవర్లకు గాను 502/7 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ, మయాంక్ అగర్వాల్ (371 బంతుల్లో 215, 22 ఫోర్లు, 5 సిక్సులు) డబుల్ సెంచరీ చేశారు.

Story first published: Friday, October 4, 2019, 16:55 [IST]
Other articles published on Oct 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+