|
పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్..
మూడో రోజు ఆటలో మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతి అనూహ్యంగా బౌన్స్ అయింది. దాంతో కొంత తడబాటుకు గురైన పుజారా.. డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. అది కాస్త పుజారా గ్లోవ్స్‌ను తాకుతూ లెగ్ సైడ్ దూసుకెళ్లింది. ఇక లెగ్ స్లిప్ ఫీల్డర్‌గా ఉన్న పీటర్సన్.. సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. అచ్చం సూపర్ మ్యాన్‌లానే డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అతని మైమరిపించే ఫీల్డింగ్‌కు పుజారాతో పాటు నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా బిత్తరపోయాడు. ఇదేం బౌన్స్రా అయ్యా అంటూ ఆశ్చర్యపోయారు. సహచర ఆటగాళ్లు కూడా పీటర్సన్ క్యాచ్ ఫిదా అయ్యారు.

రబడాకు చిక్కిన రహానే..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే కూడా రబడా బౌన్సర్‌ను అంచనవేయలేక మూల్యం చెల్లించుకున్నాడు. అతను వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ అనూహ్యంగా బౌన్స్ అయి రహానే గ్లోవ్స్‌ను ముద్దాడుతూ కీపర్‌కు అందకుండా దూసుకెళ్లింది. అయితే ఈ బంతిని అందుకునేందుకు కీపర్ ప్రయత్నించి విఫలమవ్వగా.. అతని చేతి గ్లోవ్స్‌ను తాకి గాల్లోకి లేచిన బంతిని కెప్టెన్ డీన్ ఎల్గర్ అందుకున్నాడు. అయితే అంపైర్ నాటౌటివ్వగా.. సౌతాఫ్రికా రివ్యూకెళ్లి ఫలితం రాబట్టింది. ప్రస్తుతం ఈ రెండు వికెట్లకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.
|
ఫ్యాన్స్ ఫైర్..
కైగన్ పీటర్స్ సూపర్ క్యాచ్‌ను అందరూ కొనియాడుతుండగా.. దారుణంగా విఫలమైన రహానే, పుజారాలపై మండిపడుతున్నారు. ఈ ఇద్దరిని జట్టు నుంచి తప్పించాలని కోరుతున్నారు. చివరి టెస్ట్‌లో పుజారా, రహానేలను అనవసరంగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలతో రాణించినంత మాత్రానా వారు ఫామ్‌లోకి వచ్చారని భావించడం ఏ మాత్రం బాలేదని మండిపడుతున్నారు. హనుమ విహారిని ఆడించినా పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీపైనే భారం..
57/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 26 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(16 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(15) ఉన్నాడు. కేఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్ (7) రెండో రోజే వెనుదిరగ్గా... పుజారా (9), రహానే కూడా వారినే అనుసరించారు. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.