
2010 తర్వాత అత్యుత్తమ భాగస్వామ్యం:
రోహిత్, అగర్వాల్ మొదటి వికెట్‌కు ఇప్పటికే 202 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు భారత్ తరఫున కొన్ని రికార్డులను బద్దలు కొట్టారు. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్, గంభీర్ 2010లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సఫారీలపై భారత్‌కు ఇదే తొలి 100+ ఓపెనింగ్ భాగస్వామ్యం. టెస్ట్ కొత్త జోడి రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్.. 47 సంవత్సరాల తర్వాత సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ను ఆడిన ఓపెనింగ్ జంటగా నిలిచింది. 1972లో గవాస్కర్, పార్కర్ జంట ఆడింది.

హాఫ్ సెంచరీతో రికార్డు:
మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ చేసి ఓ రికార్డు బద్దలు కొట్టాడు. భారత్ తరఫున సొంతగడ్డపై, విదేశాల్లో అరంగేట్రంలో 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు రుసి మోదీ, సురిందర్ అమర్‌నాథ్, అరుణ్ లాల్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా ఈ ఘనత సాధించారు.

ఆరు టెస్టు ఇన్నింగ్సుల్లో 50పైగా స్కోర్లు:
భారత గడ్డపై వరుసగా ఆరు టెస్టు ఇన్నింగ్సుల్లో 50పైగా స్కోర్లు చేసిన నాలుగో ఆటగాడిగా రోహిత్ శర్మ రెకార్డులోకి ఎక్కాడు. 2016 సెప్టెంబర్ నుంచి రోహిత్ శర్మ 50పైగా స్కోర్లు సాధిస్తున్నాడు. ఈ జాబితాలో ఎవర్టన్ వీక్స్ (1948 నవబర్- 1949 ఫిబ్రవరి), రాహుల్ ద్రవిడ్ (1997 నవంబర్ - 1998 మార్చి), ఆండీ ఫ్లవర్ (1993 మార్చి - 2000 నవంబర్)లు ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 100పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం అందించిన భారత ఏడో జోడీగా మయాంక్, రోహిత్ నిలిచారు.

100పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం జాబితా:
# మన్కడ్-ఇంజినీర్ (ఆస్ట్రేలియాపై 1969/70లో 111 పరుగులు)
# గావాస్కర్ -అరుణ్ లాల్ (శ్రీలంకపై 1982లో 156 పరుగులు)
# సెహ్వాగ్ - ద్రవిడ్ (పాక్‌పై 2005/06లో 410 పరుగులు)
# జాఫర్ - కార్తీక్ దక్షిణాఫ్రికాపై 2006/07లో 153 పరుగులు)
# విజయ్ - ధావన్ (ఆస్ట్రేలియాపై 2012/13లో 289 పరుగులు)
# రాహుల్ - పార్థివ్ (ఇంగ్లాండ్‌పై 2016/17లో 152 పరుగులు)
# మయాంక్ - రోహిత్ దక్షిణాఫ్రికాపై 2019/20లో 202* చేశారు)


Click it and Unblock the Notifications












