ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్.. డబుల్ సెంచరీకి ఇంకా 200 పరుగులు మాత్రమే!!

విజయనగరం: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభమయ్యే టెస్టుల్లో ఓపెనర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మకు సిరీస్ ఆరంభానికి ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన రోహిత్ శర్మ కేవలం రెండు బంతులే ఎదుర్కొని తీవ్రంగా నిరాశ పరిచాడు.
రోహిత్ డకౌట్:
సన్నాహక మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా బోర్డు ప్రెసిడెంట్స్ బ్యాటింగ్‌కు దిగగా.. ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు ఆరంభించారు. దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలిండర్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. దాంతో రోహిత్ ఇన్నింగ్స్ సున్నా వద్దే ముగిసింది. టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఓపెనర్‌గా రోహిత్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. దీంతో రోహిత్ పేలవ ప్రదర్శనపై అప్పుడే సోషల్ మీడియలో సెటైర్ల వర్షం మొదలైంది.

రోహిత్‌కు మరో డబుల్ సెంచరీ:
రోహిత్ శర్మ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేశాడని వ్యంగ్యంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'రోహిత్‌కు మరో డబుల్ సెంచరీ' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'సిరీస్ ఇంకా ఆరంభం కాకుండానే రోహిత్ డకౌట్లు మొదలేట్టేశాడు' అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. 'రోహిత్ టెస్టుల్లో డకౌట్‌గా అవ్వడం కంటే ఓపెనర్‌గా రావడమే ఫన్నీగా ఉంది' అని ఓ అభిమాని ట్వీటాడు. 'రోహిత్ డబుల్ సెంచరీ చేయడానికి ఇంకా రెండొందల పరుగులు మాత్రమే తక్కువ అయ్యాయి' అని మరొక నెటిజన్ పేర్కొన్నాడు.
మాజీల మద్దతు:
టెస్ట్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవుతుండటంతో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఓపెనర్‌గా రోహిత్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఓపెనర్‌గా అతడు రాణించాలనే ఉద్దేశంతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు పగ్గాలు అప్పగించి సన్నాహక మ్యాచ్‌లో బరిలోకి దింపారు. కానీ.. ఫిలాండర్ అతని ఆశలను చిదిమేసాడు. రోహిత్‌కు భారత మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ ఓపెనర్‌గా అతడికి అవకాశం ఇవ్వాలని సూచించారు. భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె సైతం అండగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications