IND vs SA: 5 వికెట్లతో చెలరేగిన షమీ.. విశాఖ టెస్టులో టీమిండియా ఘన విజయం

వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి వికెట్లు తీయడంతో 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 63.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. సొంత గడ్డపై ఏడాది జరిగిన టెస్టులో భారత్ అద్భుత ఆటతో ఆకట్టుకుంది.

రెచ్చిపోయిన షమీ:
11/1 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే డిబ్రుయిన్ (10)ను రవిచంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేసాడు. ఇక ఆ తర్వాతి ఓవర్‌లో పేసర్ మహ్మద్ షమీ ..తెంబ బువుమా (0)ను పెవిలియన్ చేర్చాడు. పిచ్ నుంచి బౌన్స్, స‍్వింగ్ రాబడుతూ మరింత రెచ్చిపోయిన షమీ.. 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను తీసి దక్షిణాఫ్రికా టాపార్డర్ వెన్నువిరిచాడు. డుప్లెసిస్ (13), డీకాక్ (0)లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

జడేజా స్పిన్ మాయాజాలం:
మరోవైపు రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలం చూపించాడు. బంతిని రెండు వైపులకు తిప్పుతూ సఫారీలను ముప్పుతిప్పలు పెట్టాడు. 10 పరుగుల వ్యవధిలో మార్కరమ్ (39),ఫిలిండర్ (0), మహరాజ్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీలు 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే సేనురాన్ ముత్తుసామి, డేన్ పీడ్ట్ ఆదుకునే ప్రయత్నం చేశారు. లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

డేన్‌పీట్ అద్భుత పోరాటం:
లంచ్ అనంతరం కూడా ముత్తుసామి, డేన్‌పీట్ అద్భుత పోరాటం చేశారు. ఈక్రమంలోనే డేన్‌పీట్ (56) హాఫ్ సెంచరీ చేసాడు. అంతేకాదు వీరిద్దరు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ప్రొటీస్ స్కోర్ బోర్డు ముందుకు సాగింది. అయితే హాఫ్ సెంచరీ చేసిన డేన్‌పీట్‌ను షమీ బోల్డ్ చేసాడు. దీంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. డేన్‌పీట్ ఔటైన తర్వాత కగిసో రబడా (18) క్రీజ్‌లో నిలవలేదు. రబడాను షమీ ఔట్ చేసి భారత్‌కు విజయం ఖాయం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో షమీ ఐదు వికెట్లు తీయగా.. జడేజా నాలుగు వికెట్లు సాధించాడు. అశ్విన్‌కు వికెట్ దక్కింది.

రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్:
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 502/7 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 323/4 వద్ద డిక్లేర్డ్ చేయగా.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 191 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ.. రోహిత్ రెండు సెంచరీలు చేశారు. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications