Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీగా మలచడం మాటల్లో చెప్పలేనంత ఆనందం: మయాంక్

IND V SA 2019,1st Test : Mayank Agarwal: 'I Enjoyed Hohit Sharma's Partnership,He Supported Me Alot'
IND vs SA: Mayank Agarwal expresses happiness about his double century

విశాఖ: తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీగా మలిచినందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అని టీమిండియా యువ టెస్ట్ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ అన్నాడు. మ్యాచ్‌లో పరుగులు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ (358 బంతుల్లో 200, 23 ఫోర్లు, 6 సిక్సులు) ద్విశతకం చేసాడు. రోహిత్‌ శర్మ (176; 244 బంతుల్లో 23×4, 6×6)తో కలిసి తొలి వికెట్‌కు 317 పరుగుల భారీ భాగస్వామ్యంను నెలకొల్పాడు. రోహిత్ పెవిలియన్ చేరినా.. మిగతా ఆటగాళ్లతో జట్టు స్కోరును ముందుకు నడిపాడు. మయాంక్ ఒక్క ఇన్నింగ్స్‌తో టీమిండియా హీరో అయ్యాడు.

మాటల్లో చెప్పలేనంత ఆనందం

మాటల్లో చెప్పలేనంత ఆనందం

డబుల్‌ సెంచరీ అనంతరం మయాంక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ... 'భారత జట్టుకు పరుగులు చేయడం సంతోషంగా ఉంది. తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీగా మలిచినందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. రోహిత్‌తో కలిసి ఎప్పటికి అదే ఆటను ఆడితే జట్టుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిసారీ మేమిద్దరం ఇలాంటి మంచి భాగస్వామ్యం నెలకొల్పితే ప్రత్యర్థి జట్లకు కష్టమే. మా ఇద్దరి మధ్య చక్కని సమన్వయం కుదిరింది' అని తెలిపాడు.

 పరుగుల కోసం పునాది వేశాం

పరుగుల కోసం పునాది వేశాం

'టెస్ట్ క్రికెట్ అంటే క్రీజులో చాలా సమయం వెచ్చించాలి. క్రీజులో కుదురుకోవడానికి ఓపిక అవసరం. ఇన్నింగ్స్ ఆరంభంలో మేమిద్దరం పరుగుల కోసం పునాది వేశాం. ఆ తర్వాత ధాటిగా పరుగులు చేసాం. ఈ క్రమంలోనే భారీ భాగస్వామ్యం నెలకొల్పాం. రోహిత్‌ స్పిన్నర్లపై దూకుడుగా ఆడుతుంటే.. చూడటానికి ఎంతో బాగుంది. నాపై కూడా ఒత్తిడి తగ్గింది. రెండో రోజు లంచ్ విరామం తర్వాత బంతి బౌన్స్‌ తక్కువగా ఉంది. అయితే టీ విరామానికి తిరిగడం మొదలైంది' అని మయాంక్‌ అగర్వాల్‌ తెలిపాడు.

సఫారీలపై ఒత్తిడి పెంచారు

సఫారీలపై ఒత్తిడి పెంచారు

'బౌలింగ్‌ కూడా మంచి ఆరంభం లభించింది. ఇది మాకు శుభ పరిణామం. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా చక్కని ప్రాంతాల్లో బంతులు విసిరి సఫారీలపై ఒత్తిడి పెంచారు. మిగతా మూడు రోజులలో వికెట్‌లో కచ్చితంగా మార్పులు ఉంటాయి. విజయం సాదించడాన్ని ప్రయత్నింస్తాం' అని మయాంక్‌ పేర్కొన్నాడు.

ఆ్రస్టేలియా సిరీస్‌లో ఆరంగేట్రం

ఆ్రస్టేలియా సిరీస్‌లో ఆరంగేట్రం

'పృథ్వీ షా గాయపడటంతో అనూహ్యంగా ఆ్రస్టేలియాతో సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న మయాంక్‌ దీనిని ఉపయోగించుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌ వైఫల్యంతో అతని స్థానంలోనే మెల్‌బోర్న్‌ టెస్టులో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మయాంక్‌.. 76, 42 స్కోర్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సిడ్నీలోనూ 77 పరుగులు చేసాడు. వెస్టిండీస్‌లో మరో అర్ధ సెంచరీ తర్వాత.. డబుల్‌ సెంచరీ చేసాడు.

Story first published: Friday, October 4, 2019, 9:13 [IST]
Other articles published on Oct 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+