Aakash Chopra’s XI for SA T20Is: దినేశ్ కార్తీక్, చాహల్‌కు నో చాన్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టు వివరాలను చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ ఆదివారం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌ పేస్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌, పంజాబ్ కింగ్స్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్‌కు ఊహించినట్లే జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్‌ రాహుల్‌ జట్టును నడిపించనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ఐపీఎల్‌లో రాణిస్తోన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తిరిగి జట్టులోకి రాగా.. ఈ సీజన్‌లో తన ఫినిషింగ్‌ నైపుణ్యంతో ఆకట్టుకున్న వెటరన్‌ ప్లేయర్ దినేశ్‌ కార్తీక్‌ 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేశాడు.

డీకేకు నో చాన్స్..

డీకేకు నో చాన్స్..

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు దూరమైన దినేశ్ కార్తీక్ మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం దక్కించుకున్నాడు. దాంతో అతని రీఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేసినా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ ఆకాశ్ చోప్రా మాత్రం తన తుది జట్టులో డీకేకు అవకాశం ఇవ్వలేదు. 18 సభ్యులతో కూడిన జట్టు నుంచి ఆకాశ్ చోప్రా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక చేశాడు. ఆ వివరాలను తన యూట్యూబ్ చానెల్ వేదికగా వెల్లడించాడు. ఈ జట్టులో దినేశ్ కార్తీక్‌కు బదులు అతను రిషభ్ పంత్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు.

ఓపెనర్‌గా రుతురాజ్..

ఓపెనర్‌గా రుతురాజ్..

'సౌతాఫ్రికాతో బరిలోకి దిగే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారని అంతా అనుకుంటారు. కానీ ఎక్కువ మంది వికెట్ కీపర్లు ఉన్న నేపథ్యంలో అతనికి బదులు రుతురాజ్ గైక్వాడ్.. రాహుల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడనదే నా అంచనా. అలాగే శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడాలకు కూడా చోటు ఖాయం. ఆ తర్వాత రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతారు. ఈ నలుగురితో మిడిలార్డర్ బలంగా ఉండనుంది. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఆడనుండగా.. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్ పేసర్లుగా అవకాశం దక్కించుకుంటారు.'అని ఆకాశ్ చోప్రా అంచనా వేసాడు.

 కుల్చాకు చోటు లేదు..

కుల్చాకు చోటు లేదు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో తనదైన హిట్టింగ్‌తో చెలరేగిన దినేశ్ కార్తీక్‌తో పాటు అర్షదీప్ సింగ్, స్పెషలిస్ట్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను కూడా చోప్రా విస్మరించాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్‌ 9న (ఢిల్లీ), 12న (కటక్‌), 14న (విశాఖపట్నం), 17న (రాజ్‌కోట్‌), 19న (బెంగళూరు) ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.

ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ ఎలెవన్:

ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ ఎలెవన్:

కేఎల్ రాహుల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 23, 2022, 16:56 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X