
శుభారంభం లేదు..
288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్(9) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బ్యాటింగ్‌కు అనువైన పిచ్‌పై సౌతాఫ్రికా బౌలర్లు స్మార్ట్‌గా బౌలింగ్ చేయడంతో ధావన్-కోహ్లీ ఆచితూచి ఆడారు. క్విక్ సింగిల్స్ డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది. అనంతరం కూడా ఇదే తరహా బ్యాటింగ్ కొనసాగించిన ఈ జోడీ.. సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది.

కోహ్లీ, ధావన్ హాఫ్ సెంచరీ..
ఈ క్రమంలో శిఖర్ ధావన్.. మహరాజ్ వేసిన 18వ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ మలన్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో జోరు కనబర్చగా.. పెహ్లుక్వాయో సూపర్ డెలివరీతో శిఖర్ ధావన్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్ చివరి బంతికి నిర్లక్ష్యపు షాట్ ఆడిన రిషభ్ పంత్(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెహ్లుక్వాయో మరుసటి ఓవర్లో ఫోర్, సింగిల్‌తో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ సెంచరీ చేసేలా కనిపించాడు.

స్లోయర్ బాల్స్‌తో...
కానీ మహరాజ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమై క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో కోహ్లీ మరోసారి సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వచ్చి రావడంతో ఓ భారీ సిక్సర్ బాదాడు. అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ కూడా రాణించడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది.
క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని మగలా విడదీసాడు. శ్రేయస్ అయ్యర్(26)ను షాట్ పిచ్ బాల్‌తో క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. ఆ కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్(39)ను ప్రిటోరియస్ స్లోయర్ బాల్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే జయంత్ యాదవ్ కూడా ఔటయ్యాడు. దాంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

దీపక్ చాహర్ ఒంటరి పోరాటం..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రాతో దీపక్ చాహర్ ఒంటరి పోరాటం చేశాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో ఆశలు రేకెత్తించాడు. ఎంగిడి బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన దీపక్ చాహర్.. ప్రిటోరియస్ వేసిన 44వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. దీపక్ సూపర్ బ్యాటింగ్‌తో వ్యూహం మార్చిన సౌతాఫ్రికా.. వైడ్ యార్కర్లతో ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేసింది.
కానీ క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేసిన దీపక్ చాహర్.. ఎంగిడి వేసిన 46వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. మగలా బౌలింగ్‌లో క్విక్ డబుల్ తీసిన దీపక్ చాహర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బుమ్రా ఓ బౌండరీ బాదడంతో టీమిండియా విజయానికి 18 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి.
అయితే ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దీపక్ చాహర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. పెహుల్‌క్వాయో వేసిన 49వ ఓవర్లో బుమ్రా కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. చాహల్ ఔటవ్వడంతో భారత్ పోరాటం ముగిసింది.