Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత హోటళ్లు బాగాలేకపోయినా.. మైదానాలు మాత్రం సవాళ్లు విసురుతాయి!!

IND vs SA: Dean Elgar Says Indian hotels are maybe not as good, but you get challenged on the field

రాంచీ: భారత్‌లో మైదానాలు సవాళ్లు విసురుతాయి. ఇక్క పర్యటిస్తే ఆటగాడిగా ఎంతో నేర్చుకోవచ్చు. మన సత్తా ఏంటో కూడా తెలుస్తుంది అని దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్‌ ఎల్గర్‌ అన్నాడు. ఛాంపియన్‌షిప్‌లో ఇప్పుడు పాయింట్లు ఇప్పుడు ఎంతో కీలకం. మాకు 40 పాయింట్లు వచ్చే అవకాశం ఇంకా ఉంది అని ఎల్గర్‌ ధీమా వ్యక్తం చేసాడు. విశాఖ టెస్టులో సెంచరీ (160, 2) చేసిన ఎల్గర్‌.. పుణె టెస్టులో 6, 48 పరుగులు చేసాడు. శనివారం చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎల్గర్‌ మీడియాతో మాట్లాడాడు.

భారత పర్యటన అత్యంత సవాల్‌:

భారత పర్యటన అత్యంత సవాల్‌:

'భారత పర్యటన అత్యంత సవాల్‌తో కూడుకున్నది. భారత్‌లో పర్యటిస్తే ఒక క్రికెటర్‌గా మనమేంటో తెలుస్తుంది. ఇక్కడి హోటళ్లు అంతగా బాగాలేకపోయాయినా.. మైదానాలు మాత్రం సవాళ్లు విసురుతాయి. భారత్‌కు వస్తే నేర్చుకొనేందుకు ఎంతో ఆస్కారం ఉంటుంది. భారత బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతం. మేము ఇంకా మెరుగవ్వాల్సి ఉంది' అని ఎల్గర్‌ అన్నారు.

ప్రతి మ్యాచ్ కోసం పోరాడాలి:

ప్రతి మ్యాచ్ కోసం పోరాడాలి:

'గతంలో టెస్ట్ సిరీస్ కోల్పోతే.. చివరి టెస్టు నామమాత్రంగా ఆడేవారు. కానీ.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పుడు పాయింట్లు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ కోసం పోరాడాల్సి ఉంటుంది. చివరి టెస్టులో టీమిండియాపై గెలిస్తే 40 పాయింట్లు లభించొచ్చు. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాం. జట్టుగా మంచి ప్రదర్శన చేస్తే విజయం సాధించవచ్చు. మేము రాణిస్తామనే నమ్మకం ఉంది' అని ఎల్గర్‌ పేర్కొన్నాడు.

 మెరుగైన క్రికెట్‌ ఆడలేదు:

మెరుగైన క్రికెట్‌ ఆడలేదు:

'ఈ సిరీస్‌లో మా జట్టు నిలకడగా ఆడలేదు. మెరుగైన క్రికెట్‌ ఎవరూ ఆడలేదు. ఆటగాళ్లలో ప్రేరణ నింపేందుకు సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికీ గర్వకారణమే. మాకు మరో మ్యాచ్‌ మిగిలుంది. గెలిస్తే పరిస్థితిలో ఎంతో కొంత మార్పు తీసుకురావొచ్చు' అని ఎల్గర్‌ చెప్పుకొచ్చాడు. తొమ్మిదేళ్ల తర్వాత ఉపఖండంలో శతకం బాదిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు ఎల్గర్‌ సృష్టించిన విషయం తెలిసిందే.

 ప్రాక్టీస్‌ సెషన్‌లో కసరత్తులు:

ప్రాక్టీస్‌ సెషన్‌లో కసరత్తులు:

మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 0-2తో వెనకబడ్డ సంగతి తెలిసిందే. ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా శనివారం నుంచి చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా ఆరంభమయ్యే చివరి టెస్టు కోసం ప్రొటీస్ ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు ప్రారంభించారు. గురువారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో డుప్లెసిస్, బవుమా, డిబ్రుయన్, డికాక్, ముత్తుస్వామి పాల్గొన్నారు.

Story first published: Friday, October 18, 2019, 13:26 [IST]
Other articles published on Oct 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+