IND vs SA: కోహ్లీ.. ఏందీ ఈ పిల్ల చేష్టలు! కుర్రాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావ్!

IND vs SA: Cricket Experts Slams Virat Kohli On His Reaction To Dean Elgars Decision

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, ఓ వర్గం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో డీన్ ఎల్గర్ రివ్యూ విషయంలో కోహ్లీ ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడుతున్నారు. టీమ్‌ కాంబినేషన్, ఆటగాళ్ల బ్యాటింగ్‌ మీద దృష్టిసారించాలని, అనవసర విషయాల మీద కాదని చురకలు అంటిస్తున్నారు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో గురువారం ఆ జట్టు సారథి డీన్‌ ఎల్గర్‌ (30) అశ్విన్‌ బౌలింగ్‌లో తొలుత ఎల్బీడబ్ల్యూగా ఔటైనట్లు అంపైర్‌ ప్రకటించినా రివ్యూలో బంతి వికెట్లకుపై నుంచి వెళ్తుందని నాటౌట్‌గా ప్రకటించారు. దీనిపై కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

భావోద్వేగానికి ఆపుకోలేక..

సౌతాఫ్రికా అధికార బ్రాడ్‌కాస్టర్ సూపర్‌ స్పోర్ట్‌ను ఉద్దేశించి స్టంప్ మైక్ ముందు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తర్వాత కేఎల్‌ రాహుల్‌, అశ్విన్‌ సైతం.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక మ్యాచ్‌ జరుగుతుండగా పలు సందర్భాల్లోనూ కోహ్లీ ఏదో ఒకటి అంటుండటం కనిపించింది. దీంతో ఆ వీడియోలన్నీ సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అయ్యాయి. ఇక విరాట్‌ ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోహ్లీ ప్రవర్తన సరికాదు..

అతని తీరు సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. కాగా, ఇంకొందరు ఒకడుగు ముందుకేసి తొలుత జట్టు కూర్పు పైన, ఆటగాళ్ల బ్యాటింగ్‌పై దృష్టిసారించమని హితవు పలుకుతున్నారు. మరోవైపు పలువురు విదేశీయులు టీమిండియా సారథిని ఆటలో నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు ఎవరూ అతీతం కాదని, కోహ్లీ ప్రవర్తన రూల్స్ ఉల్లంఘించడమేనని కామెంట్ చేస్తున్నారు. ఈ తరహా ప్రవర్తనతో కుర్రాళ్లకు ఇచ్చే సందేశం ఏంటని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు.

పిల్ల చేష్టలు..

ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అయితే కోహ్లీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ పిల్ల చేష్టలు చూస్తుంటే కోహ్లీ ఇంకా పరిణతి సాధించలేదని అర్థమవుతుందన్నాడు. స్టంప్‌ మైక్‌ వద్ద ఇలా స్పందించడం దారుణమని విమర్శించాడు. ఇలా చేస్తే యువకులకు స్ఫూర్తిదాయకంగా ఉండలేడని తెలిపాడు. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్లిప్‌లో ఔటైనప్పుడు 50-50 అవకాశాలున్నప్పుడు మిన్నకుండిపోయాడని గుర్తుచేశాడు. ఈ విషయంపై ద్రవిడ్‌ అతనితో మాట్లాడతాడని అనుకుంటున్నానని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికాదే సిరీస్..

సౌతాఫ్రికాదే సిరీస్..

పేలవ బ్యాటింగ్.. చెత్త ఫీల్డింగ్‌తో సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందుకునే సువర్ణవకాశాన్ని టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. శుక్రవారం ముగిసిన చివరి టెస్ట్‌లో కోహ్లీ సేన ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లక్ష్యచేధనలో భాగంగా 101/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా అద్భుత బ్యాటింగ్‌తో 63.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కీగన్ పీటర్సన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాసీ వాన్ డస్సెన్(95 బంతుల్లో 3 ఫోర్లతో 41 నాటౌట్), టెంబా బవుమా(58 బంతుల్లో 5 ఫోర్లతో 32 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, January 14, 2022, 17:23 [IST]
Other articles published on Jan 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X