Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే ఒక్కడు: పేసర్ భువనేశ్వర్ ఖాతాలో అరుదైన రికార్డు (ఫోటోలు)

IND vs SA: Bhuvneshwar Kumar becomes first Indian bowler to take five-wickets in each of the three formats

హైదరాబాద్: జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (5/24) అద్భుత బౌలింగ్‌తో రాణించడంతో లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 175 పరుగులకే కుప్పకూలింది.

దీంతో భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్లు సాధించిన తొలి పేస్ బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్ భువనేశ్వర్. గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్ ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

భారత్ తరఫున ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

భారత్ తరఫున ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు

గతేడాది చిన్నస్వామి స్టేడియంలో 4 ఓవర్లు వేసిన చాహల్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలుపు రేసులోకి వచ్చినా... చివరకు ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 175/9కే పరిమితమైంది.

దక్షిణాఫ్రికా అభిమానుల్లో ఎక్కడో గెలుపు ఆశ

దక్షిణాఫ్రికా అభిమానుల్లో ఎక్కడో గెలుపు ఆశ

సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగానే ఉన్నప్పటికీ క్రీజులో బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోని ఉండటంతో పాటు చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. దీంతో దక్షిణాఫ్రికా అభిమానుల్లో ఎక్కడో గెలుపు ఆశ. అదే సమయంలో బెహార్డీన్‌ను చాహల్‌ ఔట్‌ చేయడంతో 81 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

18 బంతుల్లో 50 పరుగులు

18 బంతుల్లో 50 పరుగులు

మరోవైపు హెండ్రిక్స్‌ దూకుడుగా ఆడటం, క్లాసన్‌ (16) దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించడంతో 17 ఓవర్లకు దక్షిణాఫ్రికా 154/4తో నిలిచింది. దీంతో 18 బంతుల్లో దక్షిణాఫ్రికా విజయానికి 50 పరుగులు అవసరమయ్యాయి. టీ20ల్లో ఇది సాధ్యమే. కానీ ఆతిథ్య జట్టు ఆశలపై భువీ నీళ్లు చల్లాడు.

నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు

నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు

భారత విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో భువీ హ్యాట్రిక్ దెబ్బకు సఫారీలు చిత్తయ్యారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి టీ20లో నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. మొదటిసారి టీ20ల్లో 5 వికెట్లు తీసిన భువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది.

Story first published: Wednesday, February 21, 2018, 12:47 [IST]
Other articles published on Feb 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+