Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: మలుపు తిప్పిన అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ (Video)

సెంచూరియన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టీ20లో గెలిచి రెండో మ్యాచ్‌లో ఓడిన సూర్యసేన గొప్పగా పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది.

తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో, 8 ఫోర్లు, 7 సిక్సర్ల) సెంచరీతో కదంతొక్కాడు.యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతంతో సత్తాచాటాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్, సిమెలన్ చెరో రెండు వికెట్లు, జేన్సన్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమైంది.

IND vs SA Axar Patel s Stunning Catch to Dismiss David Miller in 3rd T20I- Watch

జేన్సన్ (54 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) గొప్పగా పోరాడారు. అయితే అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. గట్టి పోటీనిచ్చిన దక్షిణాఫ్రికా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. కాగా, ఓ దశలో సౌతాఫ్రికా పోటీలోనే లేదు. 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా 84/4తో నిలిచింది. కానీ హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి డేవిడ్ మిల్లర్ (18; 18 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

మిల్లర్ తనశైలికి విరుద్ధంగా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు మిల్లర్ మద్దతుగా క్లాసెన్ గేర్ మార్చి బౌండరీలతో హోరెత్తించాడు. 15 ఓవర్లకు వరకు జాగ్రత్తగా ఆడిన మిల్లర్ చివరి 5 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాలనుకున్నాడు. 16వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సిక్సర్‌తో తన ఉద్దేశాన్ని చెప్పాడు. నాలుగో బంతిని ఫైన్ గెల్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతిని కూడా డీప్ మిడ్‌‌వికెట్ మీదుగా సిక్సర్‌గా బాదాలని ప్రయత్నించాడు.

హార్దిక్ వేసిన బంతి మిల్లర్‌కు చక్కగా కనెక్ట్ అయ్యింది. సిక్సర్ వెళ్తుందనే ధీమాతో మిల్లర్ క్రీజులోనే ఉన్నాడు. కానీ అక్షర్ పటేల్ బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. గాల్లోకి ఎగిరి రెండు చేతులతో బంతిని అందుకున్నాడు. మిల్లర్ పెవిలియన్‌కు చేరాడు. విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మరికొన్ని ఓవర్లు క్రీజులో ఉంటే మ్యాచ్ టీమిండియా చేతుల్లో నుంచి చేజారేదే!

Story first published: Thursday, November 14, 2024, 12:51 [IST]
Other articles published on Nov 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+