Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Southafrica 4th t20: అవేశ్ ఖాన్ బౌలింగ్ అదిరింది.. దక్షిణాఫ్రికా బెదిరింది, సిరీస్ సమమైంది

IND vs SA: Avesh Khan stunning Bowling 4 for 18 Helps to India win over proteas with 82 Runs margin

దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం రాజ్ కోట్‌లో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో తొలుత టీమిండియా ఫినిషర్ దినేష్ కార్తీక్ (55పరుగులు 27బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగడంతో 20ఓవర్లకు ఇండియా 6వికెట్లు కోల్పోయి 169పరుగుల స్కోరు చేయగలిగింది. ఇక 170పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 9వికెట్లకు 87పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయింది. ఇక భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 4ఓవర్లలో 18పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లతో చెలరేగడంతో 16.5ఓవర్లకే దక్షిణాఫ్రికా జట్టు (టెంబా బవుమా రిటైర్డ్) చాప చుట్టేసింది. తద్వారా ఇండియా నాలుగో టీ20లో 82పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 2 - 2తో సమం చేసింది. చాహల్ 2, అక్షర్ 1, హర్షల్ 1 వికెట్ తీశారు.

 ఆదిలోనే దక్షిణాఫ్రికాకు ట్రబుల్

ఆదిలోనే దక్షిణాఫ్రికాకు ట్రబుల్

ఇక బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ట్రబుల్ ఎదురైంది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా భువీ బౌలింగ్లో గాయపడగా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో మరోసారి గాయపడడంతో రిటైర్డ్ హర్ట్‌గా క్రీజు వదిలాడు. మరో ఓపెనర్ డికాక్ (14పరుగులు 13బంతుల్లో) హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కన్పించాడు. అయితే హర్షల్ పటేల్ బౌలింగ్లో అనవసర రన్‌కు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికా పతనం కొనసాగింది. ప్రిటోరియస్ (0)ను అవేశ్ ఖాన్ డకౌట్ చేశాడు. కాసేపు వాన్ డర్ డుస్సెన్, క్లాసెన్ కాస్త భయంకరంగా ఆడేలా కన్పించారు.

 ఒకే ఓవర్లో 3వికెట్లు తీసిన అవేశ్ ఖాన్

ఒకే ఓవర్లో 3వికెట్లు తీసిన అవేశ్ ఖాన్

కానీ చాహల్.. క్లాసెన్‌ (8పరుగులు)ను ఎల్బీడబ్ల్యూగా బుట్టలో వేశాడు. ప్రమాదకర మిల్లర్ (9పరుగులు)ను హర్షల్ పటేల్ అద్భుతంగా బౌల్డ్ చేశాడు. అలాగే నల్లినల్లిగా ఆడి డేంజర్ గా మారే వాన్ డర్ డుస్సెన్ (20)ను 14వ ఓవర్లో అవేశ్ ఖాన్ ఔట్ చేశాడు. ఇక 12వ ఓవర్లో మార్కో జాన్సేన్ ఒక ఫోర్, సిక్స్ కొట్టి కాస్త టఫ్ ఇస్తాడేమోనని ఫీలింగ్ తీసుకొచ్చాడు. కానీ అవేశ్ ఖాన్ 14వ ఓవర్లో అతను మెడకు బాల్ గట్టిగా తాకి గాయపడ్డాడు. కాసేపు ఫిజియోతో మాట్లాడాక మళ్లీ బ్యాటింగ్ చేసిన జాన్సేన్ (12) తర్వాతి బంతికే క్యాచ్ ఔటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి కేశవ్ మహారాజ్ (4) సైతం క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఆ ఓవర్లో మూడు వికెట్లు పడ్డాయి. ఇక చివర్లో చాహల్ నార్జ్‌ను, అక్షర్ ఎంగిడి భరతం పట్టడంతో 87పరుగులకే సౌతాఫ్రికా 9వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.

మ్యాచ్ అవార్డులు

మ్యాచ్ అవార్డులు

స్ట్రాంగెస్ట్ ఫర్ఫార్మర్ - మార్కో జాన్సేన్

డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ - అవేశ్ ఖాన్

లిట్ ఆఫ్ వెన్యూ - హర్షల్ పటేల్

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - దినేశ్ కార్తీక్

Story first published: Friday, June 17, 2022, 23:02 [IST]
Other articles published on Jun 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+