For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA : రెండో టీ20 మ్యాచ్ వరుణుడి చేతుల్లో.. వెదర్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్ ఏం చెబుతుందంటే?

IND vs SA : An Interruption May Occur during Second T20I, What Weather, Pitch Report Says

తిరువనంతపురంలో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్లో రెండో టీ20 కోసం భారత్ సన్నద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. మూడో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశాలున్నట్లు అస్సాం వాతావరణ విభాగం అంచనా వేసింది.

మ్యాచ్ టైంలో క్లౌడ్ కవర్..

మ్యాచ్ టైంలో క్లౌడ్ కవర్..

ఇకపోతే త్రివేండ్రంలో జరిగిన మొదటి టీ20కి ఎలాంటి అంతరాయం కలగలేదు. ఆ మ్యాచ్ సాఫీగా సాగింది. అయితే రెండో టీ20కి మాత్రం వరుణ దేవుని కరుణ చాలా అవసరం. గౌహతిలో మ్యాచ్ సమయానికి వాతావరణం తేమగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు దాదాపు 20డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు.

మ్యాచ్ టైంలో గణనీయంగా క్లౌడ్ కవర్ ఉంటుంది. 20% వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ టైంలో కాసేపు వర్షం పడ్డా ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20కి వర్షం తగ్గడంతో ఒక్కో జట్టుకు ఎనిమిది ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

కొత్త బంతితో భీకర స్వింగ్‌కు అవకాశం

కొత్త బంతితో భీకర స్వింగ్‌కు అవకాశం

గౌహతి స్టేడియం లో స్కోరింగ్ పిచ్. ఇక్కడి పిచ్‌లో దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లే అధికంగా జరిగాయి. ఇక్కడ పిచ్ ఎక్కువగా బౌలర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ ఇండియా ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 122 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 4వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ సులభంగా టార్గెట్ ఛేదించింది.

ఇక ఈ మ్యాచ్ టైంలో ఆకాశం మేఘావృతమైతే పిచ్ పరిస్థితులు కొత్త బంతితో ఘోరమైన స్వింగ్‌కు అనుకూలిస్తాయి. రెండు వైపుల బౌలర్లు స్వింగ్ చేసేందుకు వీలు పడుతుంది. ఇది భారత్‌కు ఫుల్ అడ్వాంటేజీ కానుంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్‌ మంచి స్వింగర్లు అనే సంగతి తెలిసిందే. మొదటి టీ20లో వీరిద్దరు తమ స్వింగ్‌తో దక్షిణాఫ్రికా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. టాస్ గెలిచిన వారికి ఫుల్ అడ్వంటేజీ ఉంటుంది.

ఇరు తుది జట్ల అంచనా

ఇరు తుది జట్ల అంచనా

భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 : క్వింటన్ డికాక్, టెంబా బవుమా, రోసోవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, షమ్సీ, అన్రిచ్ నార్జ్

Story first published: Sunday, October 2, 2022, 8:10 [IST]
Other articles published on Oct 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+