Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాతో మ్యాచ్- కేఎల్ రాహుల్ ఫెయిల్యూర్స్: రోహిత్ శర్మపై ఫోకస్: ఏం చెప్పబోతోన్నాడో..!!

IND vs SA: All eyes on Rohit Sharmas Press Conference at 12:15 PM during T20 World Cup 2022

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ రెండు జట్లు కూడా గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం టీమ్ మొత్తం పెర్త్‌కు చేరుకుంది కూడా. అక్కడే నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. దక్షిణాఫ్రికాతో భారత్ పోరు మాత్రమే కాకుండా- మరో రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా బంగ్లాదేశ్-జింబాబ్వే తలపడనున్నాయి. ఉదయం 8:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతంది.

పెర్త్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఇది మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. ఇదే పెర్త్ స్టేడియంలో సాయంత్రం 4:30 గంటలకు దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది టీమిండియా. ఈ పరిణామాల మధ్య కేప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్యాహ్నం 12:15 నిమిషాకలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. పెర్త్ స్టేడియం కాన్ఫరెన్స్ హాల్‌లో ఇది ఏర్పాటయింది.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అనుసరించేబోయే వ్యూహాలు, తుదిజట్టు అంచనాలు, టీ20 ప్రపంచకప్‌ 2022లో జట్టు ప్రస్థానం, ఇప్పటివరకు సాధించిన విజయాలకు గల కారణాలు.. ఇవన్నీ ఈ విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ ప్రస్తావించే అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఓపెనర్ కేఎల్ రాహుల్ వైఫల్యంపై రోహిత్ శర్మ స్పందిస్తారని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ వరుసగా విఫలమౌతోన్న నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో అతన్ని డిమోట్ చేయొచ్చనే ప్రచారం ఉంది.

Story first published: Saturday, October 29, 2022, 8:03 [IST]
Other articles published on Oct 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+