కేప్ టౌన్‌లో భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్‌రమ్ (106; 103 బంతుల్లో) సెంచరీ సాధించాడు. కఠిన పిచ్‌పై ఇరు జట్ల ప్లేయర్లు హాఫ్ సెంచరీ సాధించడానికి కష్టపడితే.. మార్క్‌రమ్ మాత్రం మాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాను ఒంటి చేత్తో ఆదుకున్నాడు. తన జీవితంకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.

ఓవర్ నైట్ స్కోరు 62/3తో రెండో రోజ ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా (6/61) సఫారీ సేనను భయపెట్టాడు. వరుసగా వికెట్లు పడగొడుతూ ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో బుమ్రా నయా రికార్డు సృష్టించాడు. SENA దేశాల్లో అత్యధి సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా, కపిల్ దేవ్ సరసన నిలిచాడు. అయితే ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరోవైపు నుంచి మార్క్‌రమ్ దూకుడుగా ఆడాడు.

అయితే ఈ క్రమంలో మార్క్‌రమ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో భారత్‌పై వేగవంతమైన సెంచరీ సాధించిన రెండో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. తొలి స్థానంలో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 2010లో సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 75 బంతుల్లో టీమిండియా శతకం సాధించాడు. కాగా, టెస్టుల్లో ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా తరపున ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆరో ప్లేయర్ మార్క్‌రమ్ రికార్డు నెలకొల్పాడు.
కాగా, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌రమ్ సెంచరీ చేయగా, డీన్ ఎల్గర్ (12), జేన్సన్ (11) రెండంకెల స్కోరు సాధించారు. మిగిలిన సఫారీ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. బుమ్రా ఆరు వికెట్లు, ముకేశ్ కుమార్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు. భారత్ విజయం సాధించాలంటే 79 పరుగులు చేయాలి.