Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కసి..కసి..కసి సౌతాఫ్రికా కసి..! అరివీర భీకర సెంచరీతో అలరించిన రోసోవ్.. ఇండియాకు భారీ టార్గెట్

Ind vs Sa 3rd T20I : Rilee Rossow Century Knock Helped Southafrica To Score 227

ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు అత్యంత కసితో ఆడారు. ఈ సిరీస్ ఇప్పటికే భారత్ కైవసం అవడంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ ఫ్యాక్టర్ కాదు. అయినా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ముగింపుతో వీడ్కోలు పలకాలనే ఇంటెంట్‌‌ను దక్షిణాఫ్రికా బ్యాటర్లు కనబరిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇక బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు సమర్థంగా సింపుల్‌గా భారత బౌలర్లను ఎదుర్కోగలిగారు.

రీలి రోసో సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లు మరోసారి డెత్ ఓవర్లలో తేలిపోయారు. ఏకంగా చివరి 5ఓవర్లలో 73పరగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లో దీపక్ చాహర్ ఏకంగా 24పరుగులిచ్చుకున్నాడు.

ఇక సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ బవుమా (3) నిరాశపరిచినా.. క్వింటన్ డికాక్ (68పరుగులు 43బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు) హాఫ్ సెంచరీతో దంచికొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో రోసోవ్ (100పరుగులు 48బంతుల్లో 7ఫోర్లు, 8సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టాడు. రోసోవ్ బ్యాటింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. బౌలర్ ఎవరనేది చూడకుండా ఆకాశమే హద్దుగా రోసో బ్యాటింగ్ ప్రతాపం సాగింది.

రెండో వికెట్‌కు డికాక్‌తో కలిసి 90పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన రోసోవ్.. ఆ తర్వాత త్రిస్టన్ స్టబ్స్ ( 23పరుగులు 18బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్)తో కలిసి 87పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కడవరకు రోసోవ్ క్రీజులో నిలిచి ఆద్యంతం భీకర హిట్టింగ్‌తో అలరించాడు. రోసోవ్ సెంచరీ అనంతరం దక్షిణాఫ్రికా సహచర ప్లేయర్లే కాకుండా.. స్టాండ్స్‌లో ఉన్న భారత అభిమానులు సైతం చప్పట్లతో అభినందించారు.

చివరి ఓవర్లో మిల్లర్ (5బంతుల్లో 19పరుగులు మూడు సిక్సర్లు) వరుసగా మూడు సిక్సర్లు బాదాడంతో ఆ ఓవర్లో మొత్తం 24పరుగులొచ్చాయి. దీంతో 227పరుగుల భారీ స్కోరు నమోదైంది. ఇక 228పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా ఛేదిస్తుందో లేదో చూడాలి.

Story first published: Tuesday, October 4, 2022, 21:02 [IST]
Other articles published on Oct 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+