Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Sa 3rd T20I : చివరికి ఓటమితో ముగించారు.. దక్షిణాఫ్రికా ఘన విజయం

Ind vs Sa 3rd T20I : India lost the last T20I. India won the series 2-1

ఇండోర్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ భారీ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇక బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు అరివీర భీకరంగా చెలరేగారు. రీలి రోసో సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక తర్వాత ఛేదనకు దిగిన ఇండియా 178పరుగులకే ఆలౌటైంది.

తద్వారా 49పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయింది. ఇక ఓడిపోయినప్పటికీ సిరీస్ 2-1తేడాతో భారత్ వశమైంది. ఛేదనలో భారత బ్యాటర్లలో దినేష్ కార్తీక్ (46పరుగులు 21బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), పంత్ (27పరుగులు 14బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), దీపక్ చాహర్ (31పరుగులు 17బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) మినహా మిగతావాళ్లు తుస్సుమనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో పార్నెల్ 2, మహరాజ్ 2, లుంగీ ఎంగిడి 2, రబాడా 1, డ్వేన్ ప్రిటోరియస్ 3 వికెట్లు తీసి సత్తా చాటారు.

అంతకుముందు సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ బవుమా (3) నిరాశపరిచినా.. క్వింటన్ డికాక్ (68పరుగులు 43బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు) హాఫ్ సెంచరీతో దంచికొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో రోసోవ్ (100పరుగులు 48బంతుల్లో 7ఫోర్లు, 8సిక్సర్లు) సెంచరీతో చెలరేగి ఆడాడు. రోసోవ్ రెండో వికెట్‌కు డికాక్‌తో కలిసి 90పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత త్రిస్టన్ స్టబ్స్ (23పరుగులు 18బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్)తో కలిసి 87పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో మిల్లర్ (5బంతుల్లో 19పరుగులు 3సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, దీపక్ చాహర్ తలా ఓ వికెట్ తీశారు.

మూడో టీ20కి ఇరు జట్లు :
దక్షిణాఫ్రికా ( ప్లేయింగ్ XI ): టెంబా బావుమా (కెప్టెన్ ), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రోసౌ, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

Story first published: Tuesday, October 4, 2022, 22:43 [IST]
Other articles published on Oct 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+