IND vs SA 2nd T20: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: బవుమా, సౌతాఫ్రికా జట్టుకు పెద్ద దెబ్బ, సేమ్ జట్టుతో ఇండియా

దక్షిణాఫ్రికాతో అయిదు టీ20మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో టీమిండియా వెనకబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 212పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. ఇక నేడు కటక్‌లో జరిగే రెండో టీ20లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో మన బ్యాటర్లు అద్భుతంగా చెలరేగినప్పటికీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. శ్రేయస్ అయ్యర్ క్యాచ్ మిస్ తప్పిదం కూడా ఓటమికి ప్రధాన కారణం. అలాగే చాహల్‌ను వినియోగించుకోవడంతో రిషబ్ పంత్ కాస్త మిస్టేక్ చేశాడు. ఇక తొలి మ్యాచ్‌లో జరిగిన లోపాలు అన్నింటినీ సరిదిద్దుకుని రెండో టీ20లో రాణించి సిరీస్ విజయానికి పట్టాలెక్కాలని టీమిండియా చూస్తోంది. ఇకపోతే సౌతాఫ్రికా కొత్త ఉత్సాహంతో ఈ మ్యాచ్‌లో గెలిచి 2-0తేడాతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాకు భారి దెబ్బపడింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, కీపర్ క్వింటన్ డికాక్ గాయం వల్ల రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
అసలు ఈ గ్రౌండ్ ఎలా రియాక్ట్ అవుతుందోనని
ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన టెంబా బవుమా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం బవుమా మాట్లాడుతూ.. 'అసలు ఈ గ్రౌండ్ ఎలా రియాక్ట్ అవుతుందో మేం ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నాం. ఎంతకైన మంచిదని బౌలింగ్ ఎంచుకున్నాం. గత మ్యాచ్ లో మేం మంచిగా ఛేజ్ చేశాం. ఈ స్టేడియంలో బౌండరీలు చాలా దగ్గరగా ఉన్నాయి. అందువల్ల ఛేజింగ్ చేసేటప్పుడు పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాస్త కుదురుకుని ఆడితే చాలనేది మా ప్లాన్. ఇక మా జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. ఇద్దరు కాస్త సీరియస్‌గా గాయపడ్డారు. గాయపడ్డ క్వింటన్ డికాక్, త్రిస్టన్ స్టబ్స్ స్థానంలో రీజా హెండ్రిక్స్, హెనిరిచ్ క్లాసన్ తుది జట్టులోకి వచ్చారు.' అని పేర్కొన్నాడు.
ఫస్ట్ మ్యాచ్‌లో మరి అంత పెద్ద తప్పులేం చేయలేదు
ఇక టాస్ ఓడిన రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'మేము కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలని అనుకున్నాం. ఎందుకంటే ఈ ట్రాక్ నిజంగా బాగుంది. ఇక మేము తొలుత బ్యాటింగ్ చేసి బిగ్ స్కోర్ సాధించాలనుకుంటున్నాము. మేము గత గేమ్‌లో మరి అంత పెద్ద తప్పులేం చేయలేదు. కేవలం కొన్ని సందర్భాల్లో మా ఎగ్జిక్యూషన్ సరిగా వర్క్ అవుట్ కాలేదు. మేము ఈరోజు మెరుగ్గా రాణిస్తామని భావిస్తున్నా. ఇక మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. తొలి టీ20 మ్యాచ్‌లో ఏ ప్లేయర్లు ఉన్నారో వాళ్లతోనే నేటి మ్యాచ్ లో కూడా బరిలోకి దిగుతున్నాం' అని పేర్కొన్నాడు.
తుది జట్లు
టీమిండియా ప్లేయింగ్ XI : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI : టెంబా బావుమా( కెప్టెన్ ), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నార్జ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications