
టీమిండియా విధించిన 149పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఉఫ్‌మని ఊదేసింది. కటక్‌లో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 4వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 10బంతులు మిగిలి ఉండగానే విజయ లాంఛనాన్ని ముగించింది. భువనేశ్వర్ కుమార్ (4-0-10-3) 4ఓవర్లలో కేవలం 13పరుగులే ఇచ్చి 4వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు వరుసగా ఓటమి తప్పలేదు. అలాగే రిషబ్ పంత్ కెప్టెన్సీ కూడా అంత ప్రభావవంతంగా అనిపించలేదు. గెలిచే అవకాశముండగా.. బౌలర్లను సరిగా వాడుకోవడంలో రిషబ్ విఫలమయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా (35పరుగులు 30బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్) మొండిగా క్రీజులో నిలబడగా.. హెన్రిచ్ క్లాసెన్ తన టీ20 కెరీర్లోనే అత్యధిక స్కోరు (81పరుగులు 46బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సులు) వీరవిహారం చేయడంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఇక ఎప్పటిలాగే మిల్లర్ (20పరుగులు 15బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్ నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలబడి గెలుపుతో మ్యాచ్ ముగించాడు. ఈ విజయంలో దక్షిణాఫ్రికా సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వచ్చింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ 4, యుజ్వేంద్ర చాహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
ఇక టాస్ గెలిచిన టెంబా బవుమా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలుత ఇషాన్ కిషన్ (34పరుగులు 21బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (40పరుగులు 35బంతుల్లో), దినేష్ కార్తీక్ (30పరుగులు 21బంతుల్లో) రాణించడంతో 20ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 148పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి.. టీమిండియా స్కోరుకు కళ్లెం వేశారు. అన్రిచ్ నార్జ్ 2వికెట్లు తీయగా.. రబాడా 4ఓవర్లలో 15పరుగులే ఇచ్చి 1వికెట్ తీసి రాణించారు. ఇక పార్నెల్, ప్రిటోరియస్, మహరాజ్ తలా ఒక వికెట్ తీసి టీమిండియాను కట్టడి చేశారు.
తుది జట్లు :
టీమిండియా ప్లేయింగ్ XI : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI : టెంబా బావుమా( కెప్టెన్ ), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నార్జ్
అవార్డులు
స్ట్రాంగెస్ట్ ఫార్మార్ - డేవిడ్ మిల్లర్ (91మీ సిక్సర్)
డ్రీమ్ 11గేమ్ ఛేంజర్ - భువనేశ్వర్ కుమార్ (4-13)
వెన్యూ లిట్ - హెనిరిచ్ క్లాసెన్ (81పరుగులు 46బంతుల్లో)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - హెనిరిచ్ క్లాసెన్