For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీలో భారత జట్టుకు అదిరిపోయే స్వాగతం.. సిరీస్ నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్

Ind vs Sa 2nd ODI : Teamindia Players Recieved A Warmful Welcome at Ranchi

లక్నోలోని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో ఓటమి తర్వాత.. సిరీస్‌లోని రెండవ వన్డే కోసం టీమిండియా జార్ఖండ్‌లోని రాంచీకి చేరుకుంది. సిరీస్‌లో ప్రస్తుతం 1-0తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది. అందువల్ల రెండో మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్లో నిలవాలని శిఖర్ ధావన్ సేన చూస్తుంది. భారత జట్టులో టీ20 ప్రపంచకప్ ఆడే ప్లేయర్లు అందరూ ఈ సిరీస్‌కు మిస్సయ్యారు. అందువల్ల భారత్ యువ ప్లేయర్లతో కూడిన జట్టుతో బరిలోకి దిగింది. ఇకపోతే దక్షిణాఫ్రికా జట్టు 2023 వన్డే ప్రపంచ‌కప్ కోసం తమ స్థానాన్ని ఇంకా సుస్థిరం చేసుకోలేదు.

అందువల్ల ఈ సిరీస్ బవుమా సేనకు చాలా కీలకం కానుంది. ఈ సిరీస్లో గెలిస్తే.. వన్డే ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 20 పాయింట్ల మేర ఆ జట్టుకు లబ్ధి చేకూరుతుంది. టీమిండియా ప్లేయర్లు రెండో వన్డేకు ముందు చాలా రిలాక్స్‌గా కన్పించారు. శిఖర్ ధావన్, జట్టులోని ఇతర ప్లేయర్లు రాంచీ విమానాశ్రయంలోకి ఎంటర్ కాగానే అభిమానుల నుంచి వారికి ఘన స్వాగతం లభించింది. జట్టు హోటల్‌కు చేరుకోగానే.. వారికి సంగీత, నృత్య ప్రదర్శనలతో కళాకారులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అలాగే ప్లేయర్లకు తిలకం దిద్దారు. బీసీసీఐ వీడియో విభాగం.. లక్నో నుంచి రాంచీ వరకు టీం మొత్తం ప్రయాణ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

రెండో వన్డేకు తుది జట్టు (అంచనా)
టాపార్డర్ : శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్,
మిడిలార్డర్ : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్),
లోయర్ ఆర్డర్ : శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్,
టెయిలెండర్లు : మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్

Story first published: Saturday, October 8, 2022, 15:45 [IST]
Other articles published on Oct 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+