Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్న మార్కరమ్, హెండ్రిక్స్..! రఫ్ బౌలింగ్‌తో సిరాజ్ ప్రతాపం.. అయినా టార్గెట్ టఫ్ఫే!

Ind vs Sa 2nd ODI : Hendricks, Markram Stable Halfcenturies Helped Southafrica to Score 278

రాంచీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇక నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 278పరుగులు చేసింది.

బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌లో 279పరుగుల టార్గెట్ ఛేదించడం టఫే. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లను ఎదుర్కొన్న రీజా హెండ్రిక్స్ (74పరుగులు 76బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్), ఐడెన్ మార్కరమ్ (79పరుగులు 89బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 3, వాషింగ్టన్ సుందర్ 1, షాబాజ్ అహ్మద్ 1 , కుల్దీప్ యాదవ్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ చాలా రఫ్‌గా పడింది. అతను తన 10ఓవర్ల కోటాలో 3వికెట్లు తీసి ఒక మెయిడిన్ సహా 38పరుగులు మాత్రమే ఇచ్చాడు.

40పరుగులకే రెండు వికెట్లు

అనారోగ్యంతో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, స్పిన్నర్ షమ్సీ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వారి స్థానాల్లో రీజా హెండ్రీక్స్, ఫర్చ్యూన్ బరిలోకి దిగారు. స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా కేశవ్ మహరాజ్ వ్యవహరిస్తున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 5పరుగులకే కట్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ వేసిన బంతిని అంచనా వేయడంలో డికాక్ విఫలమయ్యాడు. కాసేపు జాన్నేమన్ మలన్ (25పరుగులు), రీజా హెండ్రిక్స్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే అరంగేట్ర బౌలర్ అయిన షాబాజ్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో మలన్‌ను ఎల్పీడబ్ల్యూగా పెవిలియన్ పంపించాడు. దీంతో 40పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా కష్టాల్లో పడింది.

క్రీజులో పాతుకుపోయిన రీజా, ఐడెన్

అయితే నంబర్ 3లో వచ్చిన ఐడెన్ మార్కరమ్, రీజా హెండ్రిక్స్ ఇద్దరు క్రీజులో పాతుకుపోయి ఆడారు. అడపా దడపా బౌండరీలు బాదుతూ రన్ రేట్ మెయింటెన్ చేస్తూ ఆడారు. 13పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ గండం నుంచి మార్కరమ్ బతికిపోయాడు. ఇండియా రివ్యూ తీసుకున్నప్పటికీ.. అంపైర్ కాల్ (నాటౌట్)గా రావడంతో మార్కరమ్ ఊపిరి పీల్చుకున్నాడు. మరోసారి అవేశ్ ఖాన్ బౌలింగ్లోను ఔట్ గండం నుంచి తప్పించుకున్నాడు. ఇక సుందర్, శార్దూల్ బౌలింగ్లో వీరిద్దరు మంచి పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఇద్దరు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 129పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరి జోడిని సిరాజ్ విడదీశాడు. షాబాజ్ అందుకున్న చక్కని క్యాచ్‌కు పెవిలియన్ బాట పట్టాడు.

చివర్లో కట్టుదిట్టంగా భారత బౌలింగ్

తదనంతరం మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ (30పరుగులు) కాసేపు వికెట్ కాపాడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టారు. అయితే 215పరుగుల వద్ద క్లాసెన్ వికెట్‌ను సౌతాఫ్రికా కోల్పోయింది. కుల్దీప్ వేసిన 38వ ఓవర్లో క్లాసెన్ హిట్ చేయగా.. లాంగాన్లో పరిగెత్తుకుంటూ వచ్చి సిరాజ్ క్యాచ్ అందుకోవడంతో 46పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే స్కోరు వద్ద 39వ ఓవర్ వేసిన సుందర్ బౌలింగ్లో మార్కరమ్ కూడా ఔటయ్యాడు. అయితే క్రీజులోకి వచ్చిన మిల్లర్, వేన్ పార్నెల్ నింపాదిగా ఆడారు. తనను ఎంతగానో అభిమానించే చిన్నారి ఫ్యాన్ చనిపోవడం పట్ల దిగ్ర్భాంతికి గురైనప్పటికీ.. మిల్లర్ ఆ బాధతోనే బ్యాటింగ్‌కు దిగడం విశేషం. ఇకపోతే భారత బౌలర్లు చివర్లో లయ అందుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. పరుగులు రావడం కష్టమైంది. మిల్లర్ తనదైన హిట్టింగ్ చేయలేకపోయాడు. కడవరకు బ్యాటింగ్ చేసినప్పటికీ 34బంతుల్లో 35పరుగులు మాత్రమే చేయగలిగాడు. శార్దూల్ బౌలింగ్లో వేన్ పార్నెల్ (16) శ్రేయస్ చేతికి చిక్కాడు. చివరి ఓవర్లో సిరాజ్ కేశవ్ మహరాజ్ (5) వికెట్ తీయడంతో పాటు కేవలం 3పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా 7వికెట్లకు 278పరుగులు చేయగలిగింది.

తుది జట్లు:

భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్

సౌతాఫ్రికా: జన్నెమన్ మలాన్, క్వింటన్ డి కాక్(కీపర్), రిజా హెన్రీక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ పార్నెల్, కేశవ్‌ మహరాజ్, ఫర్చ్యూన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్

Story first published: Sunday, October 9, 2022, 17:36 [IST]
Other articles published on Oct 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+