
అద్భుతంగా బౌన్స్ బ్యాక్
ఈ సిరీస్‌లో భారత జట్టు పుంజుకున్న తీరు అద్భుతం. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడిన అనంతరం.. చివరి రెండింటినీ గెలుచుకుంది. విశాఖపట్నంలో జరిగిన మూడో మ్యాచ్‌తో అద్భుత విజయాన్ని అందుకుంది టీమిండియా. గుజరాత్ రాజ్‌కోట్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ ప్రొటీస్‌ను మట్టికరిపించింది. తిరుగులేని ఆధిక్యాన్ని కనపరిచింది. ఏకంగా 82 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా బౌలర్లు సత్తా చాటిన మ్యాచ్ అది.

ఊపుపై నీళ్లు..
ఈ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లల్లో సాధించిన విజయాలతో ఊపుమీద ఉంది భారత జట్టు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కూడా దక్షిణాఫ్రికాను తొక్కి పడేయడానికి సమాయాత్తమౌతోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు పెద్దగా లేనట్టే. చివరి రెండింట్లో ఆడిన ప్లేయర్లతోనే తుది పోరాటానికి దిగడం దాదాపుగా ఖాయమైంది. ఓపెనర్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.

భారీ వర్షాలతో..
అంతా బాగానే ఉన్నప్పటికీ.. చివరి మ్యాచ్‌కు వర్షం గండం పొంచివుంది. వర్షం పడటానికి 68 శాతం అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మూడు రోజులుగా బెంగళూరులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోజులో ఏదో ఒక సమయంలో దంచికొడుతోంది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి సీగేహల్లి చెరువు ఉప్పొంగింది. కేఆర్ పురం గాయత్రీ లేఅవుట్‌లో వరద కాలువ పోటెత్తింది. ఈ ఘటనలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి గోడ కూలి ఒకరు మరణించారు.

వర్షం పడే ఛాన్స్..
ఈ రేంజ్‌లో వర్షం బెంగళూరులో పడుతోంది. ఇవ్వాళ కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాత్రి పూట వర్షం పడటానికి 68 శాతం వరకు ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. అదే జరిగితే మ్యాచ్ రద్దు కావచ్చు. అదే జరిగితే సిరీస్ ఎటూ తేలదు. రెండు జట్లూ సమవుజ్జీగా నిలుస్తాయి. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా రికార్డయింది. సాయంత్రానికి మరింత పెరగొచ్చనేది ఐఎండీ అంచనా.

భారీ స్కోర్‌కు ఛాన్స్..
ఇక్కడి చిన్నస్వామి స్టేడియం.. ఎప్పుడూ భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న పిచ్. టీ20 ఫార్మట్‌కు అనుకూలంగా ఉంటుంది. బౌండరీ లైన్ చిన్నదిగా ఉండటం దీనికి ఓ కారణం. క్విక్ అవుట్ ఫీల్డ్ కావడం వల్ల బంతి బుల్లెట్లా బౌండరీకి దూసుకెళ్తుంటుంది సాధారణంగా. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధికంగా 202 పరుగులు నమోదయ్యాయి. ఈ పిచ్‌పై లోయెస్ట్ స్కోర్ 122 పరుగులు. శ్రీలంక-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది రికార్డయింది.


Click it and Unblock the Notifications












