విరాట్ కోహ్లీని పక్కన పెట్టినట్టే: నచ్చజెబుతామంటోన్న బీసీసీఐ: జట్టు ప్రయోజనాలు ముఖ్యమట

ముంబై: ఈ ఐపీఎల్ సీజన్.. కొందరు ప్లేయర్లను ఓవర్‌నైట్ సూపర్‌స్టార్లను చేసింది. ఆల్‌రెడీ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న మరికొందరిని తొక్కేసింది. భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రెండో కేటగిరీలోకి వస్తాడు. ఈ సీజన్‌లో కోహ్లీ తన స్థాయి ఆటను ఆడట్లేదనడంలో సందేహాలు అక్కర్లేదు. అరుదుగా చెప్పుకొనే గోల్డెన్ డక్‌ను విరాట్ కోహ్లీ- ఈ ఒక్క సీజన్‌లోనే మూడుసార్లు రికార్డ్ చేశాడంటే అతని ఆటతీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెస్ట్ అవసరమంటూ..

రెస్ట్ అవసరమంటూ..

ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టిన ప్రతీసారీ కోహ్లీపై విమర్శల దాడి సాగుతూనే ఉంది. అదే సమయంలో అభిమానులు సానుభూతిని కూడా కురిపిస్తోన్నారు. మాజీ క్రికెటర్లు సైతం అతనిపై కీలక వ్యాఖ్యలు చేస్తోన్నారు. విరాట్ కోహ్లీ విపరీతమైన క్రికెట్ ఆడుతున్నాడని, అతనికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటూ సలహలు ఇస్తోన్నారు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడాల్సి ఉన్నందున- కొద్దిరోజుల పాటు కోహ్లీ రెస్ట్ తీసుకోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదనీ అభిప్రాయపడుతున్నారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు..

దక్షిణాఫ్రికా సిరీస్‌కు..

ఈ పరిణామాల మధ్య- ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు తన తొలి అంతర్జాతీయ సిరీస్‌ను దక్షిణాఫ్రికాతో ఆడబోతోంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ.

చర్చించిన తరువాతే..

చర్చించిన తరువాతే..

ఈ సిరీస్‌ నుంచి విరాట్ కోహ్లీని తప్పించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పటికే దీనిపై ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు. విరాట్ కోహ్లీకి కొంతకాలం పాటు విశ్రాంతిని కల్పించడం వల్ల అతను రెట్టించిన ఉత్సహంతో మళ్లీ ఫీల్డ్‌లోకి దిగుతాడనీ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ ఎంపిక చేయకపోవచ్చనీ స్పష్టం చేశారు.

జట్టు ప్రయోజనాలే ముఖ్యం..

జట్టు ప్రయోజనాలే ముఖ్యం..

దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్‌తో సిరీస్ కోసం ఆడే జట్టును ఎంపిక చేయడానికి ముందు విరాట్ కోహ్లీని సంప్రదిస్తామని ఆ సభ్యుడు వివరించారు. ఫోన్‌లో మాట్లాడటమో.. లేదా ఛాట్ ద్వారా అతని అభిప్రాయాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు. జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై కోహ్లీతో చర్చిస్తామని అన్నారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే అతణ్ని తప్పించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని సెలెక్షన్ కమిటీ సభ్యుడు వ్యాఖ్యానించారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 10, 2022, 13:00 [IST]
Other articles published on May 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X