IND vs SA 2022 T20 playing 11: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌కు కేప్టెన్ దూరం: తుదిజట్టు అంచనాలివే

బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్.. చివరికొచ్చింది. ఈ సాయంత్రమే చివరి మ్యాచ్. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సిరీస్‌లో ఇదే అయిదవది.. చివరిదీను. అత్యంత రసవత్తరంగా మారిన మ్యాచ్ ఇది. ఇందులో గెలిచిన వాడిదే సిరీస్. ప్రస్తుతం రెండు జట్లు రెండు చొప్పున విజయాలను సాధించాయి. 2-2తో సమవుజ్జీగా నిలిచాయి. ఫలితంగా- చివరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది.

సత్తా చాటుతున్న టీమిండియా..
ఈ సిరీస్‌లో భారత జట్టు పుంజుకున్న తీరు అద్భుతం. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడిన అనంతరం.. చివరి రెండింటినీ గెలుచుకుంది. అయిదో మ్యాచ్ వరకూ సిరీస్‌ను లాక్కెళ్లగలిగింది. స్థల మహత్యమో ఏంటో గానీ.. మన విశాఖపట్నంలో జరిగిన మూడో మ్యాచ్‌తో అద్భుత విజయాన్ని అందుకుంది టీమిండియా. గుజరాత్ రాజ్‌కోట్‌లో నాలుగో మ్యాచ్‌లో ప్రొటీస్‌ను మట్టికరిపించింది. తిరుగులేని ఆధిక్యాన్ని కనపరిచింది.

మార్పులు ఉండకపోవచ్చు..
ఈ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లల్లో సాధించిన విజయాలతో ఊపుమీద ఉంది రిషభ్ పంత్ సేన. ఇవ్వాళ్టి మ్యాచ్‌ను కూడా బుల్డోజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు పెద్దగా లేనట్టే. చివరి రెండు మ్యాచ్‌లల్లో ఆడిన ప్లేయర్లనే తుదిజట్టులోకి తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఓపెనర్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. ఇంప్రెస్సివ్‌గా ఆడుతున్నారు.

దక్షిణాఫ్రికాకు దెబ్బ..
దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి. తొలి రెండు మ్యాచ్‌ల్లలో గెలిచిన తరువాత చతికిలపడింది. 3, 4 మ్యాచ్‌లల్లో దారుణంగా ఓడింది. జట్టు డిఫెన్స్‌లో పడింది. ఉన్నట్టుండి బ్యాటర్లు ఫామ్ కోల్పోయారు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో 100 పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వరుస విజయాలను సాధించిన టీమిండియాను.. అదీ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓడించాలంటే- రెండింతలు రాణించాల్సి ఉంటుంది.

కేప్టెన్ అవుట్..
దక్షిణాఫ్రికా జట్టు కేప్టెన్ టెంబా బావుమా.. చివరి మ్యాచ్ ఆడేది అనుమానమే. గాయం వల్ల అతను దీనికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాలుగో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో గాయపడ్డ విజయం తెలిసిందే. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడీ ప్రొటీస్ ఓపెనర్. చేతి వాపు ఇంకా తగ్గట్లేదనే రిపోర్ట్ ఉంది. బావుమా అందుబాటులో లేకపోతే రీజా హెండ్రిక్స్ లేదా క్వింటన్ డికాక్.. జట్టుకు నాయకత్వాన్ని వహిస్తారు.

తుదిజట్టు అంచనాలివే..
భారత్ తుదిజట్టులో- రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తుదిజట్టులో- క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్/టెంబా బావుమా (కేప్టెన్), రస్సీ వాన్ డెర్ డుస్సెన్,డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, మార్కో జెన్‌సెన్/వేన్ పార్నెల్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్ట్జె, లుంగి ఎంగిడి/తబ్రేజ్ శాంసీ ఆడొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications