For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రెండు సిరీస్‌లకు టీమిండియా జట్టు ఇదే: సన్‌రైజర్స్ పేసర్‌: ఏపీ, తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు

IND vs SA 2022: BCCI announced Indian team for the T20 series against South Africa and England

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్.. ముగింపుదశకు వచ్చేసింది. లీగ్ దశలో ఇక ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. ఇవ్వాళ్టితో అది కూడా ముగిసిపోతుంది. లీగ్ దశలో చిట్టచివరి మ్యాచ్‌- సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగనుంది. ముంబై వాంఖెడె స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. లీగ్ దశ ముగియడంతో ఆరు జట్లు ఇంటి ముఖం పడతాయి. ప్లేఆఫ్స్‌కు చేరిన టీమ్స్ సైతం మహారాష్ట్రను వీడనున్నాయి.

దక్షిణాఫ్రికాతో సిరీస్..

దక్షిణాఫ్రికాతో సిరీస్..

ఈ మెగా టోర్నమెంట్ ముగిసిన తరువాత దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టు సన్నాహకం కావాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ను ఆడుతుంది టీమిండియా. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.

ఇదివరకే దక్షిణాఫ్రికా టీమ్..

ఇదివరకే దక్షిణాఫ్రికా టీమ్..

17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తన జట్టును ఇదివరకే ప్రకటించింది కూడా. భారత పర్యటనకు వచ్చే 16 మంది సభ్యులు ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు టెంబా బావుమా సారథ్యాన్ని వహించనున్నాడు. ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటివారంలో జట్టు భారత్‌కు చేరుకుంటుంది.

భారత జట్టు ఇదే..

భారత జట్టు ఇదే..

దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోయే జట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఊహించినట్టే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మలిక్‌కు చోటు దక్కింది. అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌ను సైతం ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్‌లను జట్టులోకి తీసుకుంది. మొత్తం 18 మందితో కూడిన ఈ జట్టును పేర్లను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఇంగ్లాండ్‌లో పర్యటించే జట్టును కూడా ప్రకటించిన బీసీసీఐ..

ఇంగ్లాండ్‌లో పర్యటించే జట్టును కూడా ప్రకటించిన బీసీసీఐ..

దీనితోపాటు పనిలో పనిగా ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తాడు ఈ జట్టుకు. వైస్ కేప్టెన్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. కేఎస్ భరత్‌ను జట్టులోకి తీసుకుంది. ఏపీ తెలంగాణ నుంచి ముగ్గురు క్రికెటర్లు టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు. కేఎస్ భరత్, హనుమ విహారి, మహ్మద్ సిరాజ్.. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లే.

కేఎల్ రాహుల్ కేప్టెన్సీ..

కేఎల్ రాహుల్ కేప్టెన్సీ..

టీ20 జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహించనున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్‌ వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. మొత్తం టీమ్‌లో- కేఎల్ రాహుల్ (కేప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వైస్ కేప్టెన్-వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రన్ మలిక్‌ను తీసుకుంది.

 టెస్ట్ జట్టులో..

టెస్ట్ జట్టులో..

టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తాడు. కేఎల్ రాహుల్‌ను వైస్ కేప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. మొత్తం టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కేప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చేతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజ, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికయ్యారు.

Story first published: Sunday, May 22, 2022, 18:05 [IST]
Other articles published on May 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+