Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాతో తొలి టీ20: టీమిండియా పేరిట చెత్త రికార్డ్..సరిదిద్దుకునే ఛాన్స్

IND vs SA 2022 1st t20: Team India have never won a T20I series against proteas in India

న్యూఢిల్లీ: మొన్నటిదాకా ఐపీఎల్‌లో మునిగిన క్రికెట్ ప్రపంచం.. ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. అన్ని ప్రధాన జట్లూ ఇంటర్నేషనల్స్ ఆడుతున్నాయి. టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మట్‌లల్లో మెరుపులు మెరిపిస్తోన్నాయి. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. వెస్టిండీస్ టీమ్.. పాకిస్తాన్ తలపడుతోంది. అటు న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ టూర్‌లో ఉంది. చిన్నదేశాలు జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్యా సిరీస్‌లు సాగుతున్నాయి.

ఈ సాయంత్రమే..

ఈ సాయంత్రమే..

ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా.. భారత పర్యటనకు వచ్చింది. అయిదు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడబోతోంది. తొలి మ్యాచ్ ఇవ్వాళే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు. సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ జట్టుకు దూరం అయ్యారు. వారిద్దరూ గాయాలబారిన పడ్డారు.

రిషభ్ పంత్‌కు పగ్గాలు..

రిషభ్ పంత్‌కు పగ్గాలు..

కేఎల్ రాహుల్‌కు బదులుగా రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. తుదిజట్టులోకి రుతురాజ్ గైక్వాడ్ లేదా వెంకటేష్ అయ్యర్‌ను తీసుకోవచ్చు. వారిద్దరికీ కొత్త బంతిని ఎదుర్కొనే సత్తా ఉంది. ఇషాన్ కిషన్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగడానికి రుతురాజ్ గైక్వాడ్ వైపే జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గ చూపొచ్చు.

 గెలవని టీమిండియా..

గెలవని టీమిండియా..

టాప్ ఆర్డర్‌లో రిషభ్ పంత్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్‌ జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడతారనడంలో సందేహాలు అక్కర్లేదు. కాగా- దక్షిణాఫ్రికాపై టీమిండియాకు ఓ చెత్త రికార్డ్ ఉంది. దాన్ని చెరిపేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ దక్కకపోవచ్చు. ఇప్పటివరకు టీమిండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ను గెలవలేదు. 2015లో ప్రొటీస్ టీమ్.. భారత్‌లో టీమిండియాను ఓడించింది. మళ్లీ 2019లో సిరీస్‌ను సమం చేసుకుని వెళ్లింది.

 చెరిపేసుకునే ఛాన్స్..

చెరిపేసుకునే ఛాన్స్..

ఇప్పుడు మళ్లీ భారత పర్యటనకు వచ్చిందా జట్టు. అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కావడం వల్ల.. ఈ చెత్త రికార్డ్‌ను తుడిచేసుకునే ఛాన్స్ లేకపోలేదు. ఈ సిరీస్ గెలిస్తే.. మరో కీర్తి కిరీటం భారత జట్టుకు దక్కుతుంది. ఇప్పటివరకు 12 సిరీస్‌లను ఏకధాటిగా గెలిచింది టీమిండియా. ఇది 13వది. పైగా తన అయిదు చివరి టీ20ల్లో ఘన విజయాన్ని అందుకుని మంచి ఫామ్‌లో ఉంది భారత్. చివరి అయిదు టీ20ల్లో వెస్టిండీస్, శ్రీలంకలను మట్టి కరిపించింది. తన ఆరో మ్యాచ్‌ను ఈ సాయంత్రం ఆడబోతోంది.

దక్షిణాఫ్రికా దూకుడే..

దక్షిణాఫ్రికా దూకుడే..

దక్షిణాఫ్రికా కూడా వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. చివరి అయిదు టీ20 మ్యాచ్‌లల్లో ఈ టీమ్ ఓడింది ఒక్కటే. చివరి నాలుగింట్లో నెగ్గింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే.. ఆధిపత్యం టీమిండియాదే. ఇప్పటివరకు 15 టీ20ల్లో తలపడ్డాయి ఈ రెండు జట్లు. తొమ్మిదిసార్లు విజయం భారత్‌ను వరించింది. ఆరు మ్యాచ్‌లల్లో ఓడింది.

తుదిజట్టు అంచనాలివే..

తుదిజట్టు అంచనాలివే..

టీమిండియా తుదిజట్టులో- రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్-వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్/రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్. దక్షిణాఫ్రికా తుదిజట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, టెంబా బావుమా (కేప్టెన్), రస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్ట్జె, తబ్రేజ్ షాంసీ.

Story first published: Thursday, June 9, 2022, 8:49 [IST]
Other articles published on Jun 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+