Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా తుదిజట్టులో టీ20 స్పెషలిస్టులు: టీమిండియాలో గాయాలు

IND vs SA 2022 1st T20: South Africa Playing 11 vs IND: Tristan Stubbs likely to be include

ముంబై: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాళ అయిదు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటిస్తోంది. సిరీస్‌లో భాగంగా ఈ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు. సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కూడా జట్టుకు దూరం అయ్యారు.

కేఎల్ రాహుల్‌కు బదులుగా రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. వీరిద్దరి నేతృత్వంలోనే టీమిండియా.. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. 12వ తేదీన రెండో మ్యాచ్ ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో షెడ్యూల్ అయింది. మూడో మ్యాచ్ మన విశాఖపట్నంలో ఉంటుంది. ఈ నెల 14వ తేదీన ఈ మ్యాచ్ ఉంటుంది. 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని రాజ్‌కోట్, అయిదవది 19వ తేదీన బెంగళూరులో షెడ్యూల్ అయ్యాయి.

అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు.. సమరోత్సాహంతో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఉన్న టీమిండియాను ఓడించి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. భారత్‌పై ఉన్న చెక్కు చెదరని రికార్డును కొనసాగించడానికి సమాయాత్తమౌతోంది. ఇందులో భాగంగా తుదిజట్టులో టీ20 ప్లేయర్లకు చోటు కల్పించనుంది ప్రొటీస్ టీమ్.

మొన్నటిదాకా ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకోవడం ఖాయమైంది. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ట్రిస్టన్ స్టబ్స్‌ను ప్లేయింగ్ 11లో చోటు కల్పించవచ్చు. అదే జరిగితే.. స్టబ్స్‌కు ఇదే తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది. ఇదివరకు అతను 19 డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లను ఆడాడు. 508 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ స్ట్రైక్ రేట్ 160.

గుజరాత్ లయన్స్ తరఫున మెరుపులు మెరిపించిన డేవిడ్ మిల్లర్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ కల్పించే అవకాశాలు లేకపోలేదు. అతను ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండాలని జట్టు కోరుకుంటోంది. ఎన్ని ఎక్కువ బంతులను ఆడగలిగితే.. అన్ని పరుగులను రాబట్టుకోవచ్చని అంచనా వేస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన డ్వైన్ ప్రిటోరియస్‌ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. ఈ విషయంలో రీజా హెండ్రిక్స్ నుంచి అతనికి పోటీ ఉంది. ఈ ఇద్దరిలో ఒకరికే మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది.

దక్షిణాఫ్రికా తుదిజట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, టెంబా బావుమా (కేప్టెన్), రస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్ట్జె, తబ్రేజ్ షాంసీ.

Story first published: Thursday, June 9, 2022, 14:49 [IST]
Other articles published on Jun 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+