Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: విశాఖ టెస్టు తుది జట్టు ఇదే: పంత్‌పై వేటు.. వికెట్‌ కీపర్‌గా సాహా

IND vs SA 2019,1st Test : Wriddhiman Saha To Replace Rishabh Pant In Vizag Test V South Africa
IND vs SA 1st Test: Wriddhiman Saha Will Play Ahead of Rishabh Pant Confirms Captain Virat Kohli

వైజాగ్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ అక్టోబర్ 2 నుండి ప్రారంభం కానుంది. విశాఖ నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో సీనియర్ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్ సాహా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని తాజాగా స్పష్టం చేసాడు.

కెప్టెన్ ప్రకటనతో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు షాక్ తగిలింది. మరోవైపు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తుది జట్టులో ఉంటాడని కోహ్లీ తెలిపాడు. దీంతో తొలి మ్యాచ్‌ తుది జట్టుపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఇక 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నవిషయం తెలిసిందే.

ధోనీకి వారసుడిగా ఆరంగేట్రం:

ధోనీకి వారసుడిగా ఆరంగేట్రం:

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి వారసుడిగా పంత్ ఆరంగేట్రం చేసాడు. మొదటిలో బాగానే ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా చేసాడు. ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పంత్‌కు ప్రపంచకప్‌లో కూడా అవకాశం ఇచ్చారు. అక్కడ రాణించలేదు. ఇక ఇటీవలి కాలంలో అతనికి పదే పదే జట్టులో స్థానం ఇస్తున్నారు. అయినా పంత్ పరుగులు చేయలేకయాడు.

అలవాటైన చెత్త షాట్లకు ఔట్:

అలవాటైన చెత్త షాట్లకు ఔట్:

వెస్టిండీస్‌ సిరీస్‌లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔట్ అయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చే పంత్ ఇన్నింగ్స్‌ను నిర్మించలేకపోతున్నాడు. సమయం సందర్భం చూడకుండా.. భారీ షాట్ ఆడుతూ పెవిలియన్ చేరుకుంటున్నాడు. పంత్ తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐదు సింగిల్ డిజిట్ స్కోర్‌లు ఉన్నాయి.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలం:

దక్షిణాఫ్రికా సిరీస్‌లో విఫలం:

ఇక ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కూడా పంత్ 4, 19 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో కోచ్‌ రవిశాస్త్రి పంత్‌ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇక కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కూడా హెచ్చరించాడు. వీరితో పాటు పలువురు మాజీలు పంత్‌ ఆట తీరును మార్చుకోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మాత్రం ఘాటుగా స్పందించాడు. పంత్‌కు ఇచ్చిన అవకాశాలు ఇక చాలు, సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలన్నాడు.

 పంత్‌పై వేటు:

పంత్‌పై వేటు:

మాజీల సూచనలు, పేలవ ఫామ్ కారణంగా జట్టు యాజమాన్యం పంత్‌పై వేటు వేసింది. తొలి టెస్టులో పంత్ స్థానంలో సీనియర్ సాహాను జట్టులోకి తీసుకున్నాడు కెప్టెన్ కోహ్లీ. దీంతో పంత్‌కు షాక్ తగిలింది. ప్రస్తుతం సాహా విశాఖ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబందించిన పోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి సాహా ఏవిధంగా రాణిస్తాడో చూడాలి.

Story first published: Tuesday, October 1, 2019, 13:44 [IST]
Other articles published on Oct 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+