Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa: టీమిండియా 323/4 డిక్లేర్డ్, దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 395

 Ind vs sa 1st Test live score Day 4: Rohit Sharma 127 helps India set South Africa 395 to win

హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ(127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా 67 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.

భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(40: 32 బంతుల్లో 3సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(31 నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రహానె(27 నాటౌట్‌: 17 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురు సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ వన్డే తరహాలో భారీ షాట్లతో చెలరేగారు. అనంతరం ఆధిక్యం 390 దాటగానే రెండో ఇన్నింగ్స్‌ను కోహ్లీ డిక్లేర్‌ చేశాడు.

సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీయగా... కగిసో రబాడ, ఫిలాండర్‌లకు చెరో వికెట్ లభించింది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే ఆట ముగిసే సమయానికి కనీస్ రెండు వికెట్లు తీయాలనేది టీమిండియా ప్లాన్. నాలుగో ఆటలో భాగంగా రెండున్నర సెషన్లకు పైగా భారత బ్యాట్స్‌మన్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

1
46113

అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 385/8తో నాలుగో రోజైన శనివారం ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.
ఓవర్‌నైట్‌ ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌(9) అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

చివర్లో సఫారీ బౌలర్ ముత్తుసామి మాత్రం భారత బౌలర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్‌లో అతడు 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టెస్టుల్లో అశ్విన్ తానెంత విలువైన బౌలర్‌నో మరోసారి నిరూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మొత్తం ఏడు వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ కెరీర్‌లో మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

Story first published: Saturday, October 5, 2019, 17:28 [IST]
Other articles published on Oct 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+