Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: ఈ ముగ్గురు ఉంటే చాలు.. తొలి వన్డేలో భారత్‌దే విజయం!

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి(నవంబర్ 30) నుంచి ప్రారంభం కానుంది. రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో నేడు మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ తొలి మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను ప్రారంభించాలని టీమిండియా చూస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి వన్డేలో అద్భుతమై ప్రదర్శన చేయగల ముగ్గురు భారత ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

1. అర్ష్‌దీప్ సింగ్
జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్ లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో జరిగే ఈ వన్డే సిరీస్‌లో భారత పేస్ దాడిని అర్ష్‌దీప్ సింగ్ ముందుండి నడిపించనున్నాడు. కొత్త బంతితో దక్షిణాఫ్రికా బ్యాటర్లకు అర్ష్‌దీప్ పెను ప్రమాదంగా మారవచ్చు. అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున ఆడిన 11 వన్డేల్లో 17 వికెట్లు పడగొట్టాడు.

IND vs SA 1st ODI Three Indian Players Who Can Seal the Victory for Team India

2. తిలక్ వర్మ
23 ఏళ్ల తిలక్ వర్మ నిలకడగా టీమిండియా తరపున టీ20 ఫార్మాట్‌లో ఆడుతున్నాడు. అయితే అతనికి వన్డేలు ఆడే అవకాశం అంతగా లభించలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై జరిగే వన్డే జట్టులో అతనికి స్థానం దక్కింది. నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తిలక్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడు.

3. కేఎల్ రాహుల్
ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ కూడా రాంచీలో దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు సృష్టించగలడు. రాహుల్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలకమైన ఆటగాడు. అతనిపై చాలా బాధ్యత ఉంటుంది.

ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది. చాలా విరామం తర్వాత భారత క్రికెట్ అభిమానులకు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మళ్లీ మైదానంలో చూసే అవకాశం వచ్చింది. సొంతగడ్డపై ఇద్దరూ ఇంతకు మించి రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2027 ప్రపంచ కప్ లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్న రో-కోలు ఈ సిరీస్‌లో సత్తా చాటి ఆ దిశగా ముందడుగు వేస్తారేమో చూడాల్సిందే.

Story first published: Sunday, November 30, 2025, 8:43 [IST]
Other articles published on Nov 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+